తంగళ్లపల్లిలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా
అర్చకులు విశ్వనాథం నేతృత్వంలో ప్రత్యేక పూజలు – గ్రామ పెద్దలు, సమితి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం
లోకల్ గైడ్ కొందుర్గు : కొందుర్గు మండలం తంగళ్లపల్లి గ్రామంలో గణనాథుని జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించబడ్డాయి. హనుమాన్ ఆలయం వద్ద గణేష్ మండలి నిర్వాహకులు, గ్రామ పెద్దలు, సమితి సభ్యులు సమక్షంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు విశ్వనాథం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ గణనాథునికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, ఆరతి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గ్రామ పెద్ద బుర్ర కృష్ణయ్య గౌడ్ ప్రథమ పూజ చేయగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుని ఆశీర్వచనాలు పొందారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవా సమితి సభ్యులు కరుణాకర్ గౌడ్, చెక్కలి అంజి, మల్లారెడ్డి, హరీశ్వర్ రెడ్డి, శివచారి, రమేష్, శివలింగం గౌడ్, మల్లికార్జున్ గౌడ్, సంజయ్ గౌడ్, ఎం.రమేష్, బి.లింగం యాదవ్, శీను చారి, హరి చారి, ప్రకాష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సునీల్ చారి, కుమ్మరి వెంకటేష్, శివరాములు గౌడ్, సి.హెచ్. విజయ్, లింగం, చిన్ని, వరుణ్, కమ్మరి రాములు తదితరులు చురుకుగా పాల్గొన్నారు. అలాగే గ్రామ సీనియర్ సభ్యులు నారాయణ చారి, బాలారెడ్డి, మల్లారెడ్డి, కృష్ణయ్య చారి తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగమయ్యారు.
పూజ అనంతరం సమితి సభ్యులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి, వినాయక చవితి ఉత్సవాన్ని సామూహిక శ్రద్ధతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం గ్రామంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరపడం సంప్రదాయం కాగా, ఈసారి కూడా అదే ఉత్సాహంతో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు గణనాథుని ఆలయానికి తరలివచ్చి ప్రార్థనలు చేసి, కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.
హనుమాన్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ – “గ్రామ సమైక్యతకు, యువత ఐక్యతకు వినాయక చవితి పండుగ ఒక ప్రతీక. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా సమిష్టిగా శ్రద్ధా భక్తులతో పండుగను నిర్వహించాం. భవిష్యత్తులో మరింత ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టి యువతలో భక్తి భావనను పెంపొందించే దిశగా ముందుకు సాగుతాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంతో తంగళ్లపల్లి గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొని, గ్రామస్తులు ఒకే వేదికపై కలుసుకుని ఆనందంగా గణనాథుని పూజలు నిర్వహించడం విశేషంగా
నిలిచింది.