ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి జ్వరాల సర్వే

భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు

ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి జ్వరాల సర్వే

రంగారెడ్డి జిల్లా బ్యూరో  (లోకల్ గైడ్ ) ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవడంతోపాటు  ఈనెల 25 నుంచి నుంచి ఇంటింటికి జ్వరాల సర్వేను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో, పారిశుద్ధ్యం, వనమహోత్సవం, త్రాగునీటి వసతి,  ఇందిరమ్మ ఇళ్లు  పై ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్ లు ఇంటింటికి తిరిగి జ్వరాల సర్వే చేపట్టాలని అన్నారు.
వైద్య అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న శానిటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలు, మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం పనులు, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఆయిల్ బాల్స్ ను  వాటర్ నిలిచి ఉన్నచోట వేయాలన్నారు.ట్యాంకులలో  నిల్వ ఉన్న నీటి మొత్తాన్ని పారవేయాలి అన్నారు. ఓ.హెచ్.యస్.ఆర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు బ్లీచింగ్, క్లోరినేషన్ తో శుభ్రం చేసి కొత్త నీటిని నింపాలన్నారు. దోమలు నివారణ కోసం ప్రతిరోజు ఫాగింగ్ చేయించాలని సూచించారు. వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులు నిర్వహించి గ్రామాల్లో డెంగ్యూ ,మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ముందు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో గ్రామాలలో మున్సిపల్ పరిధిలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలో సమన్వయంతో పంచాయతీ, మల్టీపర్పస్ సిబ్బందితో గ్రామంలో అవసరమైన పారిశుద్ధ్య పనులకు చర్యలు చేపట్టాలన్నారు. దోమల ద్వారా డెంగ్యూ ,చికెన్ గున్యా ,మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని హ్యాబిటేషన్లలో ఫాగింగ్ చేపట్టాలన్నారు. వర్షానికి పడిపోయిన విద్యుత్ స్తంభాలు, పోల్స్ గుర్తించి మరమ్మత్తులు చేయించాలని ట్రాన్స్కో అధికారులకు తెలిపారు. గ్రామాలలో పాఠశాలలో,అంగన్ వాడి కేంద్రాలలో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలన్నారు. గ్రామాలలో నివసించే ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. వర్షానికి డ్రైనేజీలలో చెత్తాచెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయించాలన్నారు. వర్షం నీరు నిలువ ఉంచకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లనుశుభ్రం చేయాలన్నారు. త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లో పర్యటించి పైప్ లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు.
వన మహోత్సవం పై సమీక్షిస్తూ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు శాఖల వారీగా లక్ష్యాలను ఈ నెల 31వ తేది లోపు ప్లాంటేషన్ పూర్తి చేయాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పై సమీక్షిస్తూ గ్రౌండింగ్ చేసి బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చిన ఇండ్లకు పేమెంట్ చేయాలని,  త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి