షాద్ నగర్ పట్టణ అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఎమ్మెల్యే పర్యటన
వివిధ సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే,డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యల గుర్తింపు, వర్షాన్ని లెక్కచేయకుండా వార్డులో ఎమ్మెల్యే పర్యటన
లోకల్ గైడ్ షాద్ నగర్ :
షాద్ నగర్ పట్టణ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ "తగ్గేదేలే" అంటున్నారు.. సమస్యలు పరిష్కారం కానంతవరకు వాటిని "ఒగ్గేదేలే" అంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలోని రెండవ వార్డులో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి తదితర అధికారులతో కలిసి బస్తీ బాట పట్టారు. ఓవైపు కుండపోతగా వర్షం కురుస్తున్నా తగ్గేదేలే అంటూ సమస్యలను తెలుసుకున్నారు. రెండో వార్డులో పలు కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యే నిండు వర్షంలో ఎంతో ఓపికగా ప్రజల నుండి సమస్యలను విన్నారు. ఇంటింటికి వెళ్లి కాలనీలలో పేరుకుపోయిన సమస్యలు మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, అంతర్గత రహదారులు, విద్యుత్ స్తంభాల సమస్యలను ప్రజలు ఎక్కువగా ఎమ్మెల్యే ముందు ఎకరవు పెట్టారు. సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే శంకర్ ప్రజల సంధించిన ప్రశ్నలకు సమాధానంగా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.మౌలిక వసతులను కల్పిస్తా..
రెండో వార్డులో పర్యటించి ప్రజల నుండి వినదులు స్వీకరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి తన ధ్యేయమని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తిచేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. కాలనీలలో అనుసంధానమైన అంతర్గత రహదారులు మెరుగైన రవాణా సౌకర్యం వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్నివేళలా ప్రజలకు తను అందుబాటులో ఉంటానని అదేవిధంగా తమ పార్టీ శ్రేణులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని సూచించారు. ప్రజా సమస్యలు తదితర అంశాలపై స్థానిక మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి తో నివేదించి వాటికి పరిష్కారం మార్గాలు వెంటనే కనుగొనాలని అక్కడే ఆదేశించారు.
మంగళవారం ఉదయం కురుస్తున్న కొండపూత వర్షాన్నీ లెక్కచేయకుండా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రెండో వార్డులో పర్యటించడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఇలా కుండపోత వర్షంలో సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్న పాపాన పోలేదని పలువురు ప్రజలు పేర్కొన్నారు. ఇంత వానలో కూడా తమ కాలనీలకు వచ్చి ఇండ్ల వద్దకు చేరుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సమీక్షించడం అదేవిధంగా రోడ్ల సమస్యను అడగడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాదాసీదాగా సామాన్య వ్యక్తిగా వీర్లపల్లి శంకర్ వార్డులో పర్యటించడం అది కూడా వర్షం పడుతున్న లెక్కచేయకుండా వార్డులో తిరగడం ఎంతో సంతోషమని అన్నారు. ప్రజా సమస్యలపై మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేకు తమ వంతు సహకారం అందిస్తామని కాలనీ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కుంకల్ల చెన్నయ్య మాజీ కౌన్సిలర్లు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ నేతలు చెంది తిరుపతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బచ్చలి నరేష్, అందే మోహన్ ముదిరాజ్, బచ్చలి రమేష్, ఖదీర్, రమేష్ గౌడ్, మాధవలు యాదవ్,శ్రీను నాయక్, మురళీ మోహన్ మసూద్ ఖాన్ రవితేజ,శంకర్, శంకర్,భగవాన్ దాస్, మంగ అశోక్, మంగ మధు, తిరుపతి గౌడ్,ముబారక్ అలీ ఖాన్, యాదగిరి, మహబూబ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..
About The Author
