పట్టుపడితే విడవం.. నీళ్లు వచ్చేదాకా ఊరుకోం

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో షాద్‌నగర్, పరిగి, చేవెళ్ల, వికారాబాద్ రైతులకు సాగునీటి భరోసా – పట్టుపడితే విడవం, నీళ్లు వచ్చేదాకా పోరాటం కొనసాగుతుందంటున్న ఎమ్మెల్యేలు

పట్టుపడితే విడవం.. నీళ్లు వచ్చేదాకా ఊరుకోం

రంగారెడ్డి జిల్లా పరిగి కేంద్రంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ త్వరలోనే సాకారం కానుందని, షాద్‌నగర్‌తో పాటు పరిగి, చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం పట్టుపడితే విడవం, నీళ్లు వచ్చేదాకా ఊరుకోమని హామీ ఇచ్చారు.

 

*లోకల్ గైడ్ న్యూస్ కొందుర్గు*

షాద్ నగర్, పరిగి ప్రాంతాలకు నీరందిస్తాం 

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ తో వ్యవసాయం సస్యశ్యామలం 

పరిగిలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ రామ్మోహన్ రెడ్డిల మీడియా సమావేశం 

 రూ. 20వేల కోట్ల నిధులు కేటాయించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు 

 మన ప్రాంత ప్రయోజనాలకు న్యాయం చేస్తామని స్పష్ఠీకరణ WhatsApp Image 2025-08-28 at 16.16.25

షాద్ నగర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ త్వరలో సాకారం కానుందని, పట్టుపడితే విడవం.. నీళ్లు వచ్చేదాకా ఊరుకోమని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆందోళనలపై అక్రమ కేసులు పెట్టిందని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని తెలిపారు. షాద్ నగర్ తో పాటు చేవెళ్ల, పరిగి, వికారాబాద్ నియోజక వర్గాల ఆయా ప్రాంతాలకు కూడా లాభం చేకూరుతుందని చెప్పారు. గతంలో తాను, పాలమూరు ఐక్యవేదిక కన్వీనర్ రాఘవులు చేసిన పోరాటం ఫలితమే ఇదని, రైతుల సాగునీటి సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రైతులు పొట్టగొట్టి పేర్లు ఊర్లు మార్చి ఈ ప్రాంతానికి రావలసిన నీటిని తమ ప్రాంతానికి తరలించాలని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిఆర్ఎస్ పార్టీని నిలదీస్తాం అని హెచ్చరించారు. కొందుర్గు మండలం లక్ష్మీదేవి పల్లి వద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు, పట్టుపడితే విడువం ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చేదాకా పోరాడుతూనే ఉంటాం అని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ రామ్మోహన్ రెడ్డిలు ధీమా మా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాకు సాగునీరు రాకుండా చేసిన నాయకులు ఎవరో జనాలకు తెలుసు అన్నారు. ఆనాడు నిస్వార్థంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత పాలకులు పేరు మార్చి పాలమూరు రంగారెడ్డి తీసుకువచ్చారని అన్నారు. వాళ్లకు అధికారం ముఖ్యం మాకు ప్రజా శ్రేయస్సు ముఖ్యం అని స్పష్టం చేశారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా గోదావరి జలాలను అనుసంధానం చేసేలా కృషి చేస్తాం అన్నారు. అధికారులు నిష్ణాతులైన ఇంజనీర్ల సూచనలతో మంచి రిజర్వాయర్ నిర్మించేలా ఈ ప్రాంతానికి మేలు చేస్తామని స్పష్టం చేశారు. సొంత డిజైన్లతో కాలేశ్వరం కట్టి కూలేశ్వరంల మార్చారనీ అధికారం అడ్డుపెట్టుకొని వాళ్ల ప్రాంతానికి సాగునీరు తరలించకపోయారని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 20వేల కోట్ల నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యేల వెంట షాద్ నగర్ నాయకులు మహమ్మద్ అలీఖాన్ బాబర్ మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, సీనియర్ నేత కృష్ణారెడ్డి, రాజు, చంద్రపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కేకే కృష్ణ, వీర్లపల్లి అన్వర్ తదితరులు పాల్గొన్నారు..  WhatsApp Image 2025-08-28 at 16.16.26 (1)

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి