క్రీడాకారుల ఎదుగుదలకు మరింత సహకారం.!

క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేసిన చేగూర్ అంజయ్య గౌడ్.!

క్రీడాకారుల ఎదుగుదలకు మరింత సహకారం.!

షాద్ నగర్(లోకల్ గైడ్); క్రీడాకారుల ఎదుగుదలకు నా వంతు మరింత సహకారం అందిస్తానని అన్నారు దాత చేగూర్ అంజయ్య గౌడ్...నియోజకవర్గం ఎమ్మెల్యే గతంలో చెప్పినట్లుగా క్రీడాకారులకు వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు గాను కావాల్సిన మెటీరియల్స్,ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఇందులో భాగంగా సోమవారం చేగూర్ గ్రామానికి చెందిన అంజయ్య గౌడ్ సహాకారంతో ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ చెస్ అకాడమీ కోచ్ నిర్వాహకులు జగన్(రిపోర్టర్)కు,క్రీడావిద్యార్థులకు బోట్స్,టైమర్స్,రూ. 25వేల రూపాయలు నగదును అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,,క్రీడాకారులకు సహకారం అందిస్తే మరింతగా రాణిస్తారని అన్నారు.అందుకోసం దాతలు ముందుకు వస్తే మరిన్ని పోటీలలో పాల్గొంటారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పలు క్రీడల కోచ్ లతోపాటు, చెస్ క్రీడాకారులు, క్రికెట్ క్రీడాకారులు, వాలీబాల్ క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి