పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

 అంగన్వాడి, మహిళా సంక్షేమ భవనాల నిర్మాణాలకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన 

పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్ నగర్ (లోకల్ గైడ్); గ్రామాల్లో పనుల జాతర కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి పథంలో పరుగులు పెట్టనున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం గల సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా ఫరూక్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పనుల జాతర కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. శుక్రవారం ఎంపీడీవో బన్సీలాల్ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో అంగన్వాడి, మహిళా సంక్షేమ భవనాల నిర్మాణాలకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సామూహిక ఇంకుడు గుంతను ప్రారంభించారు. అనంతరం మల్టీపర్పస్ వర్కర్లను, వందరోజుల ఉపాధి హామీ పనులు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, నిధుల ఆటంకాలు ఎన్ని ఎదురైన వాటన్నింటిని అధిగమిస్తూ ప్రజా పాలనను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. గత పాలకులు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. కమిషన్ల కోసం కాలేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత ప్రమాణాలను పట్టించుకోలేదని, అందువల్లే అనిత కాలంలోనే ప్రాజెక్టు కుంగిందని, కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి