బిఅర్ఎస్ యువనాయకుడు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చింతకుంటపల్లి గ్రామ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి
ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్రామ స్పెషల్ ఆఫీసర్ MEO చంద్రశేఖర్
లోకల్ గైడ్ కేశంపేట
కేశంపేట మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సామజిక సేవకుడుబి అర్ ఎస్ యువ నాయకులు పోచమోని రమేష్ యాదవ్ తమ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను 20 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందించారు.
గ్రామ స్పెషల్ ఆఫీసర్ కేశంపేట మండలం MEO చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రామ యువత, గ్రామ పెద్దలు ప్రోత్సహం అందించి గ్రామం లో 1వ తరగతి నుడి 5వ తరగతి వరకు గ్రామ పాఠశాలలో విద్యార్థుల ని చేర్పించండి, ఇక్కడ మంచి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారాని తెలిపారు. వారు మంచి విద్య ను అందిస్తున్నారని అన్నారు. కావున గ్రామ పాఠశాల విద్యార్థులకు యువకులు రమేష్ యాదవ్ లాంటి వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిచలని మరియు విద్యార్థుల కు బ్యాగ్స్ అందించినందుకు యువ నాయకులు రమేష్ యాదవ్ కు అభినందనలు తెలియచేసారు.
ఈ కార్యక్రమం లో గ్రామ స్పెషల్ ఆఫీసర్ MEO చంద్రశేఖర్, BRS యువ నాయకులు పోచమోని రమేష్ యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు సుచరిత, షహీన్, గ్రామ సెక్రటరీ మురళి మరియు గ్రామ పెద్దలు కొండల్ రెడ్డి, యాదయ్య, రమేష్, మల్లేష్, గురుప్రసాద్, వెంకటయ్య, శ్రీకాంత్, రవి, రాజేందర్, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి,వీరేష్, మైబెల్లి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.