169 వ నేత్రదానం:

నేత్రదానం ద్వారా మరో ఇద్దరికి కంటిచూపు ప్రధానం:

169 వ నేత్రదానం:

నల్లగొండ ఉమ్మడి లోకల్ గైడ్ :

నల్గొండ పట్టణం, రాములబండ ప్రాంతానికి చెందిన, , ఐ ఎన్ టి యు సి నల్గొండ పట్టణ నాయకులు, నల్గొండ పట్టణ వీధి వ్యాపారస్తుల అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి శేఖర్ (61) శుక్రవారం హఠాత్ మరణం చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది అని బంధుమిత్రులు స్నేహితులు తెలిపారు.విషయము తెలిసిన వెంటనే వీరి కుమారులు నరేష్, విక్రమ్ , సోదరులు లక్ష్మయ్య, బావమరిది సిద్ధార్థ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ దార యాదగిరి, బంధుమిత్రులు పోలా జనార్ధన్, మొహమ్మద్ సలీం, దండంపల్లి సత్తయ్య, సుభాష్, ఆమంచి శ్రీనివాస్, బొజ్జ నాగరాజు, సతీష్, వెంకటయ్య, అవుటు రవీందర్ లను సంప్రదించి మరణానంతర నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు .వీరి అంగీకారంతో  నేత్రదానం ద్వారా కార్నియా అను కంటి పొరలను సేకరించారు .మనదేశంలో 13 లక్షల మంది కార్నియా అంధత్వం తో బాధపడుతున్నారని, ప్రతీ సంవత్సరం కేవలం 50,000  కార్నియాలను సేకరించ కలుగుతున్నామనీ, వీరందరికీ కంటి చూపు రావాలంటే మరణానంతర నేత్రదానాలను వీలైనంత ఎక్కువగా చేయించాలని ఈ సంకల్పంతో ఎంతో ఖర్చుతో, ఎంతో శ్రమతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐ డొనేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని చైర్మన్ లయన్ కెవి ప్రసాద్ తెలిపారు.తమ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఇది 169వ నేత్రదానం అని, వీటి ద్వారా ఇప్పటివరకు 338 మంది కార్నియా అంధులకు కంటిచూపును అందించగలిగామని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ కడిమి తెలిపారు.మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని ఒకవేళ పార్దివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయించవచ్చని మేనేజర్ లయన్ డాక్టర్ పుల్లారావు తెలిపారు.నేత్రదాని కుటుంబ సభ్యులకు ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ అనూష, ఏచూరి శైలజ, కోట సరిత, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ కొనకంచి విజయకుమార్, డాక్టర్ ప్రవీణ్, సిఐటియు,  ఐ ఎన్ టి యూ సీ సభ్యులు, టెక్నీషియన్ బచ్చలకూర జాని, బంధుమిత్రులు తీవ్ర సంతాపాన్ని మరియు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్లు కోట సరిత ను 9640807775 లేదా చంద్రశేఖర్ చిరునోముల ను 9948143299 నెంబర్ల వద్ద సంప్రదించాలని డాక్టర్ హరనాథ్ కడిమి తెలిపారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి