అంతర్జాతీయ స్వేచ్ఛాలో భారతదేశం స్థానం151.
స్వేచ్ఛలో టాప్ టెన్ లో ఎందుకు ఉండలేకపోతున్నాం ..?
79 ఏళ్లు గడిచిన ఎందుకు నిజమైన స్వేచ్ఛ లభించడం లేదు...? రాజకీయాల్లో స్వార్థం... ప్రజాస్వామ్యానికి పెరుగుతున్న ముప్పు
లోకల్ గైడ్ 1947లో మనం రాజకీయ స్వేచ్ఛను పొందాము. కానీ నేటికీ 79 ఏళ్ల తరువాత కూడా మనం నిజమైన స్వేచ్ఛలో ముందంజ వేయలేకపోతున్నాం. పలు అంతర్జాతీయ సూచికల్లో మన స్థానం 151లో దక్కింది. ఇలా వెనుకబడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
*స్వేచ్ఛ సమానత్వంలో వెనుకబడిపోవడానికి ప్రధాన కారణాలు*
ప్రజాస్వామ్య భవనాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలు.శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా. మీడియా కేవలం స్తంభం కాదు అది ప్రజాస్వామ్య దృష్టి, శ్రవణం,ప్రజల గుండె చప్పుడు. ప్రజల కష్టసుఖాలను, ప్రభుత్వ తప్పిదాలను, సమాజంలోని దాగిన సత్యాలను వెలుగులోకి తెస్తుంది. నిజం చెప్పడమే దాని ధర్మం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.ప్రజాస్వామ్యంపై నీచపు దాడులు.2014 నుండి 2025 వరకు, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో 56 జర్నలిస్టులు హత్యకు గురయ్యారు, 300 మందిపై తప్పుడు కేసులు నమోదయ్యాయి. ఉదాహరణ...2023లో ఒడిశాకు చెందిన జర్నలిస్ట్ అభిజిత్ సాహు ఎన్ఐఎ కేసులో అరెస్టయ్యారు. ఇవి కేవలం మీడియాపై దాడులు కాదు, ప్రజాస్వామ్య హృదయంపై గుచ్చే బాకులు.నిజం వెల్లడించే జర్నలిస్టులపై తప్పుడు కేసులు.విమర్శనాత్మక పత్రికలపై ఆర్థిక ఆంక్షలు.చట్టాల దుర్వినియోగంతో స్వేచ్ఛను గొంతు నులిమే కుట్రలు.అధికారికంగా కొన్ని మాత్రమే ఉన్నాయి అనాధికారకంగా మరెన్నో ఉన్నాయి.మీడియా స్వేచ్ఛ క్షీణిస్తే, ప్రజాస్వామ్యం కాగితపు పుష్పంగా మిగిలిపోతుంది.ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడడం కేవలం ఒక నైతిక కర్తవ్యం మాత్రమే కాదు, అది దేశ భవిష్యత్తుకు అవసరమైన రక్షణ కవచం.మీడియా అణచివేత, జర్నలిస్టులపై బెదిరింపులు, కేసులు, ఆర్థిక ఒత్తిళ్లు వంటివి ప్రజాస్వామ్యాన్ని లోపల నుండి కుల్ల కొడుతున్నాయి.
*మీడియా స్వేచ్ఛకు పటిష్టమైన చట్టాలు తీసుకురావాలి.*
నార్వే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ఎప్పుడూ మొదటి స్థానంలో లేదా టాప్ 3లో ఉంటుంది. ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి చేయకుండా పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇస్తుంది.మీడియాకు పటిష్టమైన చట్టపరమైన రక్షణతో పాటు, జర్నలిస్టుల గోప్యతా హక్కులు బలంగా అమలు చేస్తుంది.మీడియా స్వతంత్రత, పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ప్రసిద్ధి చెందింది. ఇలాంటి చట్టాలు భారత దేశంలో తీసుకువచ్చినప్పుడే స్వేచ్ఛలో ముందంజలో ఉంటుంది.
*రాజకీయాల్లో స్వార్థం... ప్రజాస్వామ్యానికి పెరుగుతున్న ముప్పు*
ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన. కానీ నేటి రాజకీయాలు ఈ ఆదర్శాన్ని కాగితంపైనే ఖైదీ చేస్తున్నాయి. అధికార దాహం, వ్యక్తిగత లాభాలు, పార్టీ స్వప్రయోజనాలు రాజకీయ నీతిని కబళిస్తున్నాయి.ఎన్నికల సమయంలో "జనసేవ" ముసుగులో నాయకులు గొప్ప హామీలు గుప్పిస్తారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీలు మాయమవుతాయి. ఐదు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ 50% ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంటారు. ఇది పరిపాటిగా మారిపోయింది. హామీలు ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తే.... గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది. గత ప్రభుత్వం అవినీతి అక్రమాల పాల్పడింది . అని కల్లబొళ్ళు మాటలతో కాలం వెల్లదీస్తూ కాలం గడుపుతుంటారు. హామీలు ఓటు బ్యాంకు సాధనాలుగా మారాయి తప్ప సేవ సంకల్పాలుగా మారడం లేదు.
*ప్రజాధనం రాజకీయ స్వార్థానికి బలి*
అభివృద్ధి పేరిట సేకరించిన నిధులు పార్టీ ప్రచారం, నాయకుల వ్యక్తిగత ఇమేజ్ నిర్మాణానికి దుర్వినియోగమవుతున్నాయి. పేదల కోసం కేటాయించిన పథకాలు కూడా రాజకీయ లాభాలకు సాధనాలుగా మారుతున్నాయి.అసెంబ్లీలు, పార్లమెంట్లు ప్రజా సమస్యల చర్చా వేదికలుగా ఉండాలి.కానీ అవి నేడు రాజకీయ ఆరోపణలు, దాడుల రణక్షేత్రాలుగా మారాయి.
*స్వార్థం నుంచి సేవ వైపు మారాలి.*
ఎన్నికల హామీలు అమలు చేయకపోతే చట్టపరమైన చర్యల నిబంధనలు తప్పనిసరి.ప్రజలకు నేరుగా సమాధానమిచ్చే "పబ్లిక్ అకౌంటబిలిటీ సిస్టమ్" అమలు చేయాలి.మీడియా, సివిల్ సొసైటీ సంస్థల నిరంతర పర్యవేక్షణ చేయాలి.ఇలా చేస్తేనే రాజకీయాలు స్వార్థం నుంచి సేవాస్ఫూర్తి వైపు మళ్లీ జనసమస్యల పరిష్కారానికి అంకితమవుతాయి.
*న్యాయం ... నిదాన సుతి*
భారతదేశ న్యాయవ్యవస్థలో కేసుల పెండింగ్ సంఖ్య భయానక స్థాయికి చేరింది. 2025 నాటికి, సుప్రీంకోర్ట్, హైకోర్టులు, జిల్లా మరియు ఉపన్యాయస్థాయి కోర్టులు (విద్యుతీకృత కోర్టులు సహా) మొత్తం సుమారుగా 5.3 కోట్లు (53 మిలియన్ల) కేసులు పెండింగ్‌లో ఉన్నాయి .ఈ మొత్తం నుండి 47 మిలియన్ల (+85%) కేసులు జిల్లా కోర్టుల్లో పెండింగ్‌గా ఉన్నాయి .మరికొన్ని 60 లక్షల కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.ఇది కేవలం గణాంకం మాత్రమే కాదు ప్రతి కేసు వెనుక ఒక కుటుంబం, ఒక వ్యక్తి జీవితకాల ఆశలు, భవిష్యత్ బంధించబడి ఉన్నాయి.ఉదాహరణకు, అయోధ్య వివాదం తీర్పు రావడానికి 134 సంవత్సరాలు పట్టింది.ఇలాంటి ఆలస్యం, ప్రజల న్యాయంపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తికి న్యాయం జరగాలంటే దాదాపు ఐదు నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది.
*స్వేచ్ఛా సూచికలో ముందుండాలంటే… కేసుల తీర్పు వేగం తప్పనిసరి.*
భారతదేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విస్తరించాలి. అత్యవసర, ప్రజాస్వామ్యపరమైన ప్రాధాన్య కేసులను వేగంగా పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.కేసు ఫైల్ నుండి తీర్పు వరకు అన్ని ప్రక్రియలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. దీని వల్ల కాలయాపన, అవినీతి తగ్గుతుంది.డిజిటలైజేషన్ & ఈ-కోర్టులు పెంచాల్సిన అవసరం ఉంది.
*ఆర్టిఐ ఖాళీ భర్తీలు పూర్తి చేయాలి.*
సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) భారతదేశంలో పారదర్శక పాలన మరియు బాధ్యతాయుతమైన ప్రభుత్వ వ్యవస్థకు కీలకమైన సాధనంగా పనిచేస్తుంది. ఈ చట్టం పౌరులకు ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు మరియు పనితీరును పరిశీలించే అవకాశాన్ని అందిస్తూ, వారి హక్కులను రక్షించుకునేందుకు శక్తినిస్తుంది. అయితే, ఈ చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే, కేంద్ర మరియు రాష్ట్ర సమాచార కమిషన్లలో ఖాళీగా ఉన్న పదవులను వెంటనే భర్తీ చేయడం అత్యవసరం.ప్రస్తుతం, సమాచార హక్కు చట్టం ప్రకారం, పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజులలోపు అందించాలని నిర్దేశిస్తుంది. కొన్ని సందర్భాల్లో, అత్యవసర పరిస్థితుల్లో 48 గంటలలో అందించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సమాచార కమిషన్లలో ఖాళీలు, అవసరమైన సిబ్బంది కొరత, మరియు ఆలస్యమయ్యే ప్రక్రియల కారణంగా, చట్టంలో పేర్కొన్న గడువు మరియు వాస్తవ అమలు మధ్య పెద్ద అంతరం కనిపిస్తోంది. ఉదాహరణకు, కొన్ని రాష్ట్రాల్లో సమాచార కమిషన్లలో దాదాపు 20-30% పదవులు ఖాళీగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఖాళీల కారణంగా, RTI దరఖాస్తులకు సమాధానాలు ఆలస్యమవుతున్నాయి, దీనివల్ల పౌరులు తమ హక్కులను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నారు.ఈ సమస్యను పరిష్కరించడానికి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. ముందుగా, సమాచార కమిషన్లలో ఖాళీగా ఉన్న పదవులను పారదర్శకమైన మరియు వేగవంతమైన నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలి. రెండవదిగా, సమాచార కమిషన్లకు తగిన ఆర్థిక మరియు మానవ వనరులను కేటాయించడం ద్వారా వాటి సామర్థ్యాన్ని పెంచాలి. అదనంగా, RTI దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు మరియు ట్రాక్ చేసేందుకు సులభమైన డిజిటల్ వేదికలను బలోపేతం చేయడం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.చివరగా, పౌరులలో RTI చట్టం గురించి మరింత అవగాహన కల్పించడం కూడా ముఖ్యం. సమాచార హక్కును సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా పౌరులు ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలించి, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయవచ్చు. ఈ చట్టం యొక్క నిజమైన సామర్థ్యాన్ని సాకారం చేయడానికి, ప్రభుత్వం మరియు పౌర సమాజం కలిసి పనిచేయడం ద్వారా దాని అమలులో ఉన్న లోపాలను సరిదిద్దడం అవసరం.
*రైట్ టు రికల్ వంటి చట్టాలు చేయాలి.*
"రైట్ టు రీకాల్" అనేది ప్రజలు ఎన్నికల్లో ఎంచుకున్న ప్రతినిధి తన బాధ్యతలు, హామీలు నెరవేర్చకపోతే, పదవీ కాలం పూర్తయ్యే లోపు అతన్ని పదవి నుంచి తప్పించే హక్కు.ఈ ప్రక్రియలో సాధారణంగా ఒక నిర్దిష్ట శాతం ఓటర్లు సంతకాలు చేస్తే, రీకాల్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇలాంటి చట్టాలు భారతదేశంలో అమలు చేస్తే భారతదేశంలో అవినీతి తగ్గుతుంది. పేదరికం తగ్గుతుంది. దేశ పురోగతి అద్భుతంగా ఉంటుంది. టాప్ టెన్ లో భారతదేశం ఉంటుందని పలువురు విశ్లేషకులు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
About The Author
