అమర్‌నాథ్ యాత్రకు భద్రతా పరిరక్షణలో ప్రారంభం
లోకల్ గైడ్:
జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహల్లో కైలాసనాథుడిని దర్శించేందుకు ఈ రోజు ఉదయం 5,880 మంది యాత్రికులతో మొదటి బ్యాచ్ బయలుదేరింది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రకు ప్రారంభం చెప్పారు.
38 రోజుల యాత్ర ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర 38 రోజుల పాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజు యాత్ర ముగుస్తుంది.
ఉగ్రదాడి హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో యాత్ర మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు అమర్‌నాథ్ యాత్ర మార్గాన్ని ‘నో ఫ్లై జోన్’గా జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.
హెలికాప్టర్ సర్వీసులు రద్దు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీ అమర్‌నాథ్ శ్రైన్ బోర్డుఈసారి హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేసింది. యాత్రికులు పహల్గాం (దక్షిణ కశ్మీర్) లేదా బాల్తాల్ (ఉత్తర కశ్మీర్) మార్గాల నుంచి కాలినడకన లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకోవాలని ప్రకటించింది.