బాణంతో గంగను పైకి తేల్చిన రాముడు
అటవీ ప్రాంతంలో త్రేతయుగా అంబురామేశ్వరుడ. - బాణం ద్వారా జలం,ఆ తర్వాత శివలింగ ప్రతిష్ఠ.
శ్రావణమాసం చివరి సోమవారం నాడు జాతర ఉత్సవాలు.
లోకల్ గైడ్ వికారాబాద్ : పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి పాషాపూర్ గ్రామాల మధ్య
త్రేతా యుగపు రామకథలో వెలసిన శ్రీ అంబురామేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది.వనరుల కొరతతో బాధపడుతున్న అరణ్యవాసంలో శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి పయనిస్తుండగా,ఈ ప్రాంతం దాటే సమయంలో శ్రీరామునికి బాగా దాహం వేస్తుంది.దాహార్తి తీర్చుకోవటానికి తన దగ్గర ఉన్న రామ బాణం విసరగా భూగర్భ జలాలు పొంగి వచ్చాయని పురాణ గాథ చెబుతోంది.ఆ పవిత్ర క్షణానికి గుర్తుగా,రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు భక్తుల విశ్వాసం.ఈ లింగమే నేటి అంబురామేశ్వర స్వామి రూపంలో భక్తులను ఆశీర్వదిస్తున్నది.
అంబు అంటే బాణం. రామ అంటే....శ్రీరాముడు, ఈశ్వరుడు’ అంటే శివుడు.ఈ మూడు పదాల సమ్మిళితమే ‘అంబురామేశ్వరుడు’ త్రేతా యుగపు ఈ గాథ వల్ల ఆలయం ప్రాంతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.ప్రతిష్ఠ వైభవం
ఆలయం సాదాసీదాగా ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, శ్రావణమాసం చివరి వారంలో ఇక్కడ ప్రత్యేకోత్సవాలు జరుగుతాయి.ఈ ఉత్సవాలకు....పరిసర గ్రామాల భక్తులు మాత్రమే కాకుండా, దూరప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు, భక్తులు భారీ సంఖ్యలో వచ్చి ఈ పవిత్ర స్థలాన్ని దర్శిస్తారు.
ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా ఉండి,పక్కనే ఉన్న చిన్న చెరువు,చుట్టుపక్కల మొత్తం దట్టమైన అడవులతో అందాలను మరింత మాధుర్యంగా నిలిపివేస్తుంది. రోడ్డు సౌకర్యం సులభంగా ఉండటంతో,ఎప్పుడైనా కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసి సందర్శించవచ్చు.స్థానికులు చెబుతున్నట్టుగా,ఆలయ పరిసరాల్లో శివతత్వాన్ని అనుభూతి చేసుకోవడం ఆత్మసాంతి కలిగిస్తుంది. ఇదిలా ఉంటే, శ్రావణమాసం చివరి సోమవారంకు ముందు రోజు ఆదివారం నాడు భక్తిశ్రద్ధలతో, నియమా నిబంధనలతో తట్టేపల్లి గ్రామంలో గల జంగమొల్ల అయ్యవారి ఇంటి నుంచి స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ అంబరామేశ్వర దేవాలయం వద్దకు భజన కీర్తనలతో ఊరేగిస్తారు. తర్వాత మరుసటి రోజు చివరి సోమవారం నాడు జాతర వస్తవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇదే రోజు జాతర ఉత్సవాలు పూర్తయిన తర్వాత, స్వామివారిని కింద అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జాతర ప్రాంగణంలో కిలోమీటర్ మేరకు ప్రయాణించి, తిరిగి సాయంకాలం సమయంలో స్వామివారిని గ్రామంలోని జంగమయ్య ఇంటికి చేరవేస్తారని ఆలయ కమిటీ చైర్మన్ ఉడువల వెంకటేశం తెలిపారు.
జాతర మరసటి రోజు
చివరి సోమవారం జాతర పూర్తయిన మరుసటి రోజు తిరిగి మల్లి ఆనాటి గ్రామ ప్రజల కోరిక మేరకు తట్టేపల్లి గ్రామంలో జాతర జరుపుకుంటామని ఆలయ కమిటీ సభ్యులు కోశాధికారి అంజయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరైనా సోమవారం చివరి రోజు నిర్వహించే జాతరలో పాల్గొనని వారికి మంగళవారం గ్రామంలో జరిగే జాతర ఉత్సవాల్లో చిన్నపిల్లలు స్త్రీలు వృద్ధుల్లో ప్రతి ఒక్కరు పాల్గొంటారని వారు తెలిపారు.
రోజూ ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతాయి.ప్రత్యేక రోజుల్లో అబిషేకాలు, రుద్రపారాయణాలు నిర్వహించబడతాయి.భక్తులు పాలు, బెల్లం, అక్షింతలు, బిల్వదళాలతో పూజ చేయడం ఇక్కడి సంప్రదాయం.
త్రేతా యుగం నాటి అద్భుతాలు
త్రేతాయుగంలో శ్రీరాముడు అటవి ప్రాంతం గుండా వెళ్తున్న సమయంలో, శ్రీరామునికి బాగా దాహం వేస్తుంది. ఈ సమయంలో తన బాణంతో గంగను పైకి తెచ్చి దాహాన్ని తీర్చుకుంటారు. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో శివలింగాన్ని సైతం ప్రతిష్టించినట్లు భక్తులు అంతేకాకుండా ఏడాది కాలం పాటు నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. చలి, వాన, ఎండ కాలం అనే తారతమ్యం లేకుండా, సంవత్సరం అంతా నీరు నదిలా ప్రవహిస్తూ ఉంటుంది.ఈ నది ప్రవాహంలో ప్రవహించే నీరు తాగిన, స్నానం చేసిన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం.మరొక విషయం ఏమిటంటే అంబరామేశ్వర జాతరలో ఐదు ఆకుల పుండి కూర ఎంతో ప్రత్యేకం. ఈ ఐదాకుల పుండ్డి కూర తింటే....ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తుంటారు. మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పుణ్యక్షేత్రం వద్ద ఎవరైనా కోరికలు కోరుకుంటే, తప్పకుండా కోరికలు నెరవేరి తీరుతాయని, ఇక్కడ కోరికలు కోరుకున్న చాలా మంది భక్తులు రాజకీయ రంగంలో ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పిటిసి సర్పంచు ఉన్నత పదవులు అనుభవించారని చాలామంది భక్తుల విశ్వాసం.
శ్రావణమాసం నెల మొత్తం అన్నదానం
శ్రీ అంబు రామేశ్వర స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు నెల మొత్తం ఆలయ ప్రాంగణంలో పుణ్యక్షేత్రం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు.