ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం
జూలై 30, 2025: 12 రాశుల జాతక ఫలితాలు – ఎవరికి లాభం? ఎవరికి జాగ్రత్త? ఈ రోజు మీ రాశి మీకు ఏం చెబుతుందో తెలుసుకుని, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
హస్త నక్షత్ర ప్రభావంతో జూలై 30 బుధవారం కొన్ని రాశులకు అదృష్టం వాలింది. కొన్ని రాశులవారికి ఆదాయం పెరుగుతుంది, శుభవార్తలు, ప్రయాణాలు, ఉద్యోగ పురోగతులు కనిపిస్తుండగా... మరికొందరికి ఖర్చులు, ఒత్తిడులు ఎదురవుతాయి. మీ రాశి ఫలితాలు చదివి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 30 బుధవారం హస్త నక్షత్ర ప్రభావంతో 12 రాశులపై మిశ్రమ ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులకు అదృష్టం అద్భుతంగా సహకరిస్తే, మరికొంతమందికి జాగ్రత్త అవసరం.
- మేషం: ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. షాపింగ్‌లో ఆచితూచి వ్యయించండి. ఉద్యోగాల్లో లక్ష్యాలు చేరుకుంటారు.
-
వృషభం: ఉద్యోగ ఒత్తిడితో బిజీగా. కొత్త వ్యాపార భాగస్వాములు చేరినా, ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యం మంచిది.
-
మిథునం: శుభకార్యాల అవకాశాలు. ధన లాభం, విజయవంతమైన ప్రయాణ సూచనలు.
-
కర్కాటకం: అధికారుల వేధింపులు. కుటుంబ, వ్యాపార నిర్ణయాల్లో పెద్దల సలహా అవసరం.
-
సింహం: అనుకోని లాభాలు. నమ్మినవారు మోసం చేసే అవకాశం, జాగ్రత్త అవసరం.
-
కన్యా: పనుల్లో విజయం. ఇంటి విషయాలు బయట చెప్పకండి. పిల్లల భవిష్యత్‌పై నిర్ణయాలు తీసుకుంటారు.
-
తులా: సమాజంలో గుర్తింపు. ఉద్యోగ విజయాలు, విదేశీ అవకాశాల సూచనలు.
-
వృశ్చికం: ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
-
ధనుస్సు: పదోన్నతుల సూచనలు. వ్యాపార విభేదాలు, జాగ్రత్తలు అవసరం.
-
మకరం: పెండింగ్ పనులు ఆందోళన కలిగిస్తాయి. పెట్టుబడుల్లో ముందుచూపు అవసరం.
-
కుంభం: ధనలాభం ఉన్నా ఖర్చులు అధికం. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం, ముఖ్యంగా పిల్లలపై.
-
మీనం: అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు. వ్యాపార ప్రారంభానికి అనుకూలం. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
About The Author
Related Posts
