ప్రశాంత వాతావరణంలో జీవించండి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు.
పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన కమిషనర్
నల్లగొండ ఉమ్మడి జిల్లా (లోకల్ గైడ్); రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ గురువారం పదవీ విరమణ పొందిన టివి హనుమంతరావు అడిషనల్ డీసీపీ,స్పెషల్ బ్రాంచ్, ఎం సుగుణ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, (అకౌంట్స్), మహమ్మద్ షర్ఫుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎల్ బి నగర్, డి రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్, మహమ్మద్ ఫైజుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్, సీఐ సెల్, వి సాగర్ రావు, సబ్ ఇన్స్పెక్టర్ , ఉప్పల్ ఉమెన్ పోలీస్ స్టేషన్, మహమ్మద్ షంషీర్ ఖాన్, ఏఆర్ ఎస్ఐ హెడ్ క్వార్టర్ భువనగిరి) లకు సీపీ సుధీర్ బాబు, రాచకొండ పోలీస్ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ , ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, డిసిపి ఎస్బి జి నరసింహ రెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రవీందర్ రెడ్డి, సీఈఓ అడ్మిన్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, టేకుల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
