పాఠశాల స్థాయి ఆవిష్కరణలకు బలమైన పునాది
తెలంగాణలో ఏటిఎల్ సార్థి, మెంటర్ ఇండియా అకాడమీ ప్రారంభం,
ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఎటిఎల్ సార్థి కీలకం..గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
*
*-
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
పాఠశాలల నుంచి స్టార్టప్‌ల దిశగా ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆటేల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో ఎన్ఐటిఐ ఆయోగ్ రూపొందించిన తెలంగాణ తొలి ఎటీఎల్ సార్థి & మెంటర్ ఇండియా అకాడమీ ను వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరయ్యారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని 379 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లకు (ఎటీఎల్ఎస్) ఈ అకాడమీ ద్వారా మార్గదర్శకత్వం, మెంటారింగ్ అందించనున్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ..పాఠశాలలలో ఆవిష్కరణల బలోపేతానికి ఈ కార్యక్రమం కీలకమన్నారు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా ఇది దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్‌కు సిద్ధమైన యువతను తీర్చిదిద్దడంలో ఎఐఎమ్ ముఖ్యపాత్ర పోషిస్తోంది” అన్నారు. రాష్ట్ర నోడల్ సంస్థగా వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను నియమించారు. క్లస్టర్లుగా విభజించిన ఎటీఎల్ఎస్ కు సాంకేతిక సహాయం, ఉపాధ్యాయ శిక్షణ, స్టార్టప్ మద్దతు అందించనుంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్ మాట్లాడుతూ..యువత సామర్థ్య వినియోగమే గ్లోబల్ ఇన్నోవేషన్‌లో భారత్ స్థాయిని నిర్ణయిస్తుందని చెప్పారు. ఎఐఎమ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బగ్లా మాట్లాడుతూ..చిన్న వయసు నుంచే ఆవిష్కరణ సంస్కృతి పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఈ అకాడమీ ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆవిష్కరణ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం- విద్యాసంస్థలు-పరిశ్రమల భాగస్వామ్యంతో భవిష్యత్ పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడం లక్ష్యంగా కార్యక్రమం కొనసాగనుంది.
