విద్యార్థులకు పారిశుధ్యం పై అవగాహన అవసరం
జోనల్ కమిషనర్ కె. చంద్రకళ
By Ram Reddy
On
శంషాబాద్ ,జనవరి 17( లోకల్ గైడ్);
జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని శంషాబాద్ సర్కిల్–18లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా శనివారం శంషాబాద్ ప్రభుత్వ బాలికల హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె. చంద్రకళ మాట్లాడుతూ, మూలంలోనే చెత్త వేరు చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నిషేధం, యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ హరిత వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులతో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బి. సుమన్ రావు , డిప్యూటీ ఈఈ అన్నపూర్ణ , ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటెం ఎండ్.
Tags:
About The Author
Latest News
10 May 2026 17:08:34
కల్లూరు:లోకల్ గైడ్ :
కల్లూరు మండలం, చెన్నూరు వద్ద కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి నూతన ఏసీ కోళ్ల ఫారమ్ ను ప్రారంభించి,
