సురభి కళామందిరంలో సత్యశ్రీనాథ్ మ్యూజికల్ జర్నీ

కళాభిమానులను అలరించిన సాంస్కృతిక సంబరాలు

సురభి కళామందిరంలో సత్యశ్రీనాథ్ మ్యూజికల్ జర్నీ

 

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సురభి కాలనీ,  అవేటి మనోహర్ సురభి కళామందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో “సత్యశ్రీనాథ్ మ్యూజికల్ జర్నీ” అనే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంది అవార్డు గ్రహీత వి.సత్యశ్రీనాథ్ తన 15 ఏళ్ల కళా సేవా ప్రయాణంలో సాధించిన విశేషాలను, తాను రచించిన ప్రజాదరణ పొందిన పాటలను కళాభిమానులతో పంచుకున్నారు. నాటక రంగం, సంగీత రంగాలలో రచయితగా, దర్శకుడిగా సత్యశ్రీనాథ్ సాగించిన ప్రయాణాన్ని వివరించగా, కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత 15 సంవత్సరాలుగా సత్యశ్రీనాథ్ నిరంతరంగా అద్భుతమైన గీతాలు రచిస్తూ కళారంగానికి విశేష సేవలు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజల ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్న సత్యశ్రీనాథ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సురభి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వెంకట్ రెడ్డి, ఎస్.ఏ.జయకృష్ణ, ఎస్.ఏ. శేఖర్, ఆర్.కోదండరావు, సాయి నందన్ ముదిరాజ్, పవన్, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలమ్ యాదవ్ తదితరులు పాల్గొని కార్యక్రమానికి విశేష సహకారం అందించారు. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి