నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్; ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మర్యాదపూర్వక భేటీ
నూతన సంవత్సరం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ గారు, సంస్థ డైరెక్టర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో పెరిగినా దానికి అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రతిపాదించిన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు.
సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ గారితో పాటు సంస్థ డైరెక్టర్లు శ్రీ వి. శివాజీ, డా. యెన్. నర్సింహులు, శ్రీ సీహెచ్. చక్రపాణి, శ్రీ పి. కృష్ణా రెడ్డి గార్లు పాల్గొని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
