ఇన్ఫినిటీ ఫిన్ కార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఆధ్వర్యంలో భోసి ఉన్నత పాఠశాలకు 1,5 లక్షల విలువగల ఐఎఫ్ పి ప్యానెల్ విరాళం.
By Ram Reddy
On
ఇన్ఫినిటీ ఫిన్ కార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తానూర్ మండలంలోని భోసి ఉన్నత పాఠశాలకు 1,5 లక్షల విలువగల ఐఎఫ్ పి ప్యానలను విరాళంగా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఇన్ఫినిటీ ఫిన్ కార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వారు భోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జి రాజశేఖర్ అధ్యక్షతన శనివారం
విద్యాభివృద్ధి మిషన్ – కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్ ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విరాళంతో తరగతి గదిలో ఏర్పాటు చేసిన ఐ ఎప్ పి పానెల్ ను ఆ సంస్థ అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈ సంస్థ రీజినల్ మేనేజర్ సోమ రామరెడ్డి,ఏరియా మేనేజర్ కర్జల్ దేవీదాస్, మాట్లాడుతూ,ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడం, ఆధునిక సాంకేతిక వనరులను అందించడం వారికి అవసరమైన సహాయం చేయడం ప్రధాన లక్ష్యమని
ఈ విధమైన కార్యక్రమాల ద్వారా సమాజంలో విద్యను ప్రోత్సహిస్తూ, భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ సంస్థ విద్యాభివృద్ధి మిషన్ – కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్ ) కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని. ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతం గననియంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
1,5 లక్షల విలువగల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్ పి) తమ పాఠశాలకు విరాళంగా
ఇచ్చినందుకు ఆ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ సరోజనమ్మ, గ్రామ సర్పంచ్ పసుల సాగర నాగనాథ్, ఉప సర్పంచ్ సళ్ళ లక్ష్మణ్,విడిసి అద్యక్షులు బాలాజీ,గ్రామ పెద్దలు రాములుసార్ , కిష్టయ్య వీరందరూ సైతం ఆ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులకు పరీక్షల కోసం అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్లు,పెన్నులు స్కేల్స్ పంపిణీ చేశారు.అలాగే పాఠశాల
విద్యార్థులందకి ఫ్రూట్ జ్యూస్ బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధికారులు రీజినల్ మేనేజర్ సోమరామారెడ్డి,
ఏరియా మేనేజర్లు
పెంటు ప్రపుల్ కుమార్, కర్జల్ దేవిదాస్,బ్రాంచ్ మేనేజర్లు సోలంకే శివాజీ దాసరి నవీన్ లు క్రెడిట్ మేనేజర్ సత్యం హరి, వారి సిబ్బంది.పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
16 Apr 2026 20:20:20
నిలువునా రాలిపోతున్న ప్రాణాలకు దిక్కెవరు?
నిరంతరం ప్రమాదాలు జరిగే చోట నివారణ చర్యలు ఏవి?
