సర్పంచ్ చేతుల మీదుగా బట్టల పంపిణీ.
అపోస్తుల సంఘం ఆధ్వర్యంలో 50 మంది పేదలకు అందజేత. - నూతన పాలకవర్గ సభ్యులకు ఘన సన్మానం.
By Ram Reddy
On
లోకల్ గైడ్/తాండూర్: పెద్దేముల్ మండల పరిధిలోని బుద్ధారం గ్రామ సర్పంచ్, వాడు సభ్యుల చేతుల మీదుగా గురువారం బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అపోస్తుల సంఘ కాపరి అశోక్ మాట్లాడుతూ... గ్రామంలోనీ 50 మంది పేదలకు అపోస్తుల సంఘం ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామ సర్పంచిగా గెలుపొందిన లక్ష్మణ్, వార్డు సభ్యులకు సంఘం పక్షాన శాలువా పూలదండతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవ.అశోక్ రాజ్,పాస్టర్ ప్రేమ్ కుమార్ ,పాస్టర్ గోపాల్ , బిచ్చప్ప శ్రీనివాస్, సంఘ సభ్యులు, వార్డు సభ్యులు గోరెప్ప తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
