శ్రీ భవాని జ్యూవెలరీ వర్క్స్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ
శేరిలింగంపల్లి (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): శ్రీ భవాని జ్యూవెలరీ వర్క్స్ షాప్స్ ఓనర్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ గోల్డ్ వర్క్స్ షాప్స్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ చారి మాట్లాడుతూ..గోల్డ్ స్మిత్ వృత్తి దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ హాజరైన అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ.. భవాని గోల్డ్, సిల్వర్ షాపులు మరింత అభివృద్ధి చెందాలని, హరికృష్ణ చారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ..హరికృష్ణ చారి మంచి గోల్డ్ స్మిత్‌గా పేరు సంపాదించారని, షాపులు అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యూత్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, భాను ప్రకాష్ చారి, శ్రావణ్ కుమార్ చారి, బీసీ వైస్ ప్రెసిడెంట్ బంగారప్ప, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, తదితరులు పాల్గొన్నారు.
