ఆర్.సి.పురంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
By Ram Reddy
On
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పఠాన్ చేరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని స్వామి వివేకానంద విగ్రహానికి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ సి.అంజి రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు స్వామి వివేకానంద బోధనలు, యువతకు ఆయన అందించిన సందేశాలను స్మరించుకున్నారు. దేశ నిర్మాణంలో యువశక్తి పాత్ర అత్యంత కీలకమని, యువత జాగృతమైతే సమాజం, దేశం వేగంగా అభివృద్ధి సాధిస్తుంద ని తెలిపారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడుచుకుంటూ సేవాభావంతో సమాజా భివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
