రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా యూరియా సరఫరా చేయాలి.

బీజేపీ వేములపల్లి మండల నాయకులు

రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా యూరియా సరఫరా చేయాలి.

 లోకల్ గైడ్,తెలంగాణ 

 బిజెపి వేములపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ హేమలత కి, మండల వ్యవసాయ అధికారి కిషోర్ నాయక్ కి  రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా యూరియా సరఫరా  చేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ జిల్లా కౌన్సిల్ సభ్యులు చిర్ర సాంబమూర్తి యాదవ్ లు  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారని ఎప్పుడూ లేని విధంగా యూరియా కొరత తీవ్రంగా గత రెండు సంవత్సరాల నుంచి ఏర్పడిందని ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా యూరియా పంపిస్తున్న  రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా పక్కదారి పడుతుందని నూతనంగా తీసుకొచ్చిన   ఆన్లైన్ విధానం వల్ల కౌలు రైతులు, పట్టా భూమి లేని రైతులు,నిరక్షరాసులు, మహిళా రైతులు ఎంతో ఇబ్బందులు గురవుతున్నారని ఆన్లైన్ విధానం వల్ల ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతూ నాన్న అవసపడుతున్నారని తక్షణమే ఆన్లైన్ విధానం తొలగించి పాత విధానం ప్రకారం రైతులకు ఎటువంటి అక్రమాలకు గురికాకుండా మండలంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు ఫర్టిలైజర్ షాపులకు  యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజీ సత్యనారాయణ యాదవ్, పెదమాం వెంకన్న, బిజెపి వార్డు సభ్యులు పగిడిపల్లి సోమయ్య, బిజెపి సీనియర్ నాయకులు బొల్లెద్దు లవయ్య, మండల పార్టీ నాయకులు ఈట మహేష్, పెదమాం వెంకటేశ్వర్లు,ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేకర్, నిమ్మనగోటి మహేష్,సతీష్, శివ, రమేష్ ను పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి