మియాపూర్‌లో వీధి దీపాల కొరత, హెచ్‌ఎంటి నుంచి జెపి నగర్ వరకు ప్రమాదకర పరిస్థితులు

వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ నాయకుల వినతి

మియాపూర్‌లో వీధి దీపాల కొరత, హెచ్‌ఎంటి నుంచి జెపి నగర్ వరకు ప్రమాదకర పరిస్థితులు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

మియాపూర్ సర్కిల్ పరిధిలోని హెచ్‌ఎంటి నుంచి జెపి నగర్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో వీధి దీపాల కొరత కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాత్రి సమయంలో చీకటి ఎక్కువగా ఉండటంతో పాదచారులు, వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, భద్రతా సమస్యలు కూడా పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. అందువల్ల, అవసరమైన ప్రదేశాలలో కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు పనిచేయని దీపాలను తక్షణమే మరమ్మతులు చేయించాలని కోరారు. అలాగే ప్రధాన కూడళ్ల వద్ద హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతూ ఈ వినతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉమ్మడి మియాపూర్ డివిజన్ తరఫున ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, గుండె గణేష్ ముదిరాజ్, జాజార శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!