వడ్డెరల సంక్షేమానికి పెద్దపీట
ఘనంగా వడ్డెరల కమ్యూనిటీ హాల్ ప్రారంబించిన
By Ram Reddy
On
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి
పఠాన్ చేరు, లోకల్ గైడ్ :
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మంజీర నగర్ లో నూతనంగా నిర్మించిన వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ ను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వడ్డెరల సంక్షేమానికి ఎల్లప్పుడు అండగా ఉంటున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వడ్డెరలకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వడ్డెర సామాజిక వర్గంలోనూ ఉన్నత చదువులు చదువుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొల్లూరి మల్లేష్, గోపాల్, ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు రుశ్వంత్ రెడ్డి, యునూస్, దాసు, వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు కోమరయ్య, సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
02 Sep 2025 17:28:45
లోకల్ గైడ్ :
ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం