బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి సన్నాహకాలు ప్రారంభం

పరిశీలించిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి సన్నాహకాలు ప్రారంభం

గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి):

ఆగస్టు 24వ తేదీ, ఆదివారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో జరగనున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంకు సన్నాహకాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశానికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం నరేన్ గార్డెన్స్‌లో పర్యటన చేపట్టారు.  కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు మాట్లాడుతూ.. ఈ సమావేశం ద్వారా కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నింపబడుతుందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఇది ఒక వేదిక కానుందని తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News