సెప్టెంబర్ రెండో తేదీన ఓటర్ల తుది జాబితా జిల్లా కలెక్టర్

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలి

సెప్టెంబర్ రెండో తేదీన ఓటర్ల తుది జాబితా జిల్లా కలెక్టర్

 జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా,
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లాలోని 460 గ్రామ పంచాయతీల వారిగా ఫోటోలతో కూడిన ఓటర్ జాబితాను సిద్ధం చేసి 4102 వార్డుల వారీగా గురువారం ప్రచురించడం జరిగిందని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని నాగర్ కర్నూలు  జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా షెడ్యూల్ అంశాలపై సమావేశం నిర్వహించారు.
 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ...... రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను కలెక్టర్ వివరిస్తూ  ఈనెల 29న జిల్లా స్థాయి రాజకీయ పార్టీ నేతలతో భేటీ, 30న మండల స్థాయి రాజకీయ పార్టీ నేతలతో MPDOల భేటీ, ఈనెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాకుండా అంతకు ముందుగా కూడా ఓటర్ల జాబితా స్వచ్చీకరణ, క్లేయిములు, అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాలపై తగిన సలహాలు, సూచనలు తీసుకొని అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు.  రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుగ్గా ఉండి వారి దృష్టికి వచ్చిన ఎన్నికల అంశాలు ఏమైనా ఉంటే వాటిని సమావేశంలో తెలియజేయాలన్నారు.ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిదిద్దడం వలన స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందని తద్వారా రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా పై విశ్వాసం కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో హడావుడి చేయకుండా ముందుగానే ఓటర్ల జాబితా అభ్యంతరాలను నేటి నుంచి 31వ తేదీ వరకు అభ్యంతరాలు ఉంటే తెలియపరచాలన్నారు. ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో రాష్ట్ర వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని ప్రతి ఓటర్ తన ఓటు హక్కును జాబితాలో ఉందో లేదో తెలుసుకునే అవకాశం రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిందని కలెక్టర్ తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 460 గ్రామపంచాయతీలు, 4102 వార్డులు, 4102 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రకారం 6,47,342 ఓటర్లు ఉన్నారని, అందులో 3,23,015 మంది పురుషులు, 3,24316 మంది మహిళా ఓటర్లు, 11 మంది ఇతరులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ రెండో తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ సందర్భంగా తెలిపారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి