మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు

మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు

IMG-20250821-WA0099

నిజామాబాద్, లోకల్ గైడ్ :

జిల్లాలోని మహిళలు, యువతులకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యమైన శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం పెర్కిట్ లో కొనసాగుతున్న మహిళా, శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో కలెక్టర్ అధ్యక్షతన గురువారం సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, పనితీరు గురించి సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎం.పి.హెచ్.డబ్ల్యు), టైలరింగ్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్, బ్యూటీషియన్, కంప్యూటర్, ఐ.టీ సెక్టార్ తదితర కోర్సులలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కోర్సులలో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అనాధలు, ఒంటరి మహిళలు, స్వధర్ హోం లలో ఉండే వారు, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు, యువతులకు ప్రవేశాలలో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ ఆఫ్ తెలంగాణా (డీ.ఈ.ఈ.టి)లో ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. తద్వారా వివిధ పరిశ్రమలు, కార్పోరేట్ ఆసుపత్రులు, సంస్థలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నారు. టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి పొందేలా కుట్టు మిషన్ ల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధాన మంత్రి రోజ్ గార్ యోజన వంటి పథకాల ద్వారా రుణ సదుపాయం పొందేలా తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. పెర్కిట్ లోని మహిళా, శిశు వికాస కేంద్రం భవనంతో పాటు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో కొనసాగుతున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన మరమ్మతు పనులు చేపట్టేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. పనులు నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 63 వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహిళా ప్రాంగణం స్థలాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం అద్దె ప్రాతిపదికన అందించే ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ప్రాంగణానికి వచ్చే ప్రధాన రహదారిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించాలని, ప్రాంగణం పరిసరాలలోని పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ను ఆదేశించారు. సమావేశం అనంతరం కలెక్టర్ తరగతి గదులను సందర్శించి, వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న వారికి పలు సూచనలు చేశారు. శిక్షణ పొందడమే కాకుండా, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. సమావేశంలో మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిర, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగురావు, బీ.సీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్