గజ్వేల్‌ లో  కే సీ ఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దాడినీ ఖండించిన

బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

గజ్వేల్‌ లో  కే సీ ఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దాడినీ ఖండించిన

ఖమ్మం జిల్లా, వైరా :లోకల్ లోకల్ గైడ్, ఏప్రిల్ 04 :

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసమే పరామవధిగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ నాయకుల దాడి ఈసారి బీఆర్‌ఎస్‌ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు . గజ్వేల్‌ లోని క్యాంపు కార్యాలయంలోకి  చొరబడ్డ కాంగ్రెస్‌ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి, దానిని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు . ప్రజలకు  ఇచ్చిన హామీలు  నెరవేర్చడం  చేతగాక ప్రజల  దృష్టి  మరల్చేందుకు కాంగ్రెస్  ఇలాంటి  చర్యలను ప్రోత్సహిస్తోందని  మండిపడ్డారు.
మాజీ  ముఖ్యమంత్రి  క్యాంపు కార్యాలయం  మీద  ఇలాంటి చర్యలకు  పాల్పడితే  ఇక సామాన్యులకు  రక్షణ  ఎక్కడ ఉందని  సూటిగా  ప్రశ్నించారు. దాడికి  పాల్పడిన  దుండగులను గుర్తించి , కేసులు  నమోదు  చేసి వెంటనే  అరెస్టు  చేయాలని డిమాండ్‌  చెయ్యడం  జరిగింది . ఈ  ఘటనలో  పోలీసులు అలసత్వం  వహించడం గర్హనీయమని  పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News