దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా

తీసుకోవాలి... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా


ఖమ్మం, ఏప్రిల్ -03:లోకల్ గైడ్ :

దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు.

శుక్రవారం లకారం ట్యాంక్ బండ్ వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని, దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా *అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ* తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో చిర స్థాయిగా నిలిచారని, వారి ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మనకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. రాజకీయ, సామాజిక రంగాలలో ఎదురైన అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారని, రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, తెలంగాణ జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, బిసి సంఘ నాయకులు కూరాకుల నాగభూషణం, కురుమ సంఘ జిల్లా అధ్యక్షులు మాయర గంగయ్య, గౌరవ సలహాదారు చావళ్ల నాగేశ్వరరావు, కోడి లింగయ్య, చిత్తారు ఇందుమతి, గూడె మల్లయ్య, భూక్యా శోభా నాయక్, కొరిపల్లి శ్రీనివాస్, పెల్లూరి విజయ్ కుమార్, సాదిక్ అలీ, మేకల సుగుణా రావు, చావల నాగరాజు, మూడుముంతల గంగరాజు, తమ్మారపు బ్రహ్మయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

_సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం_ _సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం_
    -  వైరా:లోకల్ గైడ్ :గ్రామ వాసి షేక్ లతీఫ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం వైరా ఎస్సై పుష్పాల రామారావు  చేతుల మీదుగా
అరుదైన గుండె సిండ్రోమ్‌కు విజయవంతమైన చికిత్స
దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా
ఫ్రైడే డ్రై డే కార్యక్రమంతో దోమల వ్యాధులపై అవగాహన
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కు శుభాకాంక్షలు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కొండాపూర్, డివిజన్ నుంచి బలరాం యాదవ్ పోటీకి సన్నాహాలు