ఖమ్మం కొత్త బస్టాండ్ పక్కన ప్రారంభించబడిన పిస్తా హౌస్
హోటల్ నిర్వహణపై బెంబేలెత్తుతున్న ప్రజలు
By Ram Reddy
On
ఖమ్మం (లోకల్ గైడ్); మిగిలిపోయిన వ్యర్ధ పదార్థాలను ఇష్టం వచ్చినట్లు రోడ్డు పక్కన పడేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారవడమే కాకుండా, నాన్ వెజ్ వ్యర్ధాలను తినడానికి వచ్చిన వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ స్థానికులను పరుగులు పెట్టిస్తున్నాయి.
కిచెన్ కోసం ఏర్పాటు చేసే చిమ్నీల బ్లోయర్లు పై అంతస్తులో ఏర్పాటు చేయకుండా బిల్డింగ్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేయడంతో విపరీతమైన శబ్దం కాలుష్యంతో పాటు దాని నుండి వెలువడే విష రసాయనాలు క్లోరోఫ్లోరో కార్బన్లు గాలిని కలుషితం చేస్తూ పక్కన ఉన్న గృహ సముదాయాలకు ఇబ్బందికరంగా మారాయి. ఈ హోటల్ వెనుక భాగాన బస్టాండ్ ఉండటంతో బ్లోయర్లనుండి వెలువడే విషవాయులు ఆ ప్రాంతమంతా విస్తరించడం వలన దగ్గులు, తుమ్ములతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకుండా లాభాలే ద్యేయంగా హోటల్ యాజమాన్యం ప్రవర్తిస్తుంటే, పట్టించుకోవాల్సిన మున్సిపల్ అధికారులు సదరు హోటల్ వైపు క్షన్నెత్తి కూడా చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Tags:
About The Author

Latest News
26 Aug 2025 12:01:37
బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ అకౌంట్ సమస్యలు ఉన్నాయని చెప్పే వ్యక్తులపై జాగ్రత్త. వారు వెంకట అప్డేట్ చేయాలని కోరుతూ OTP అడుగుతారు. ఇలా...