చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం
-కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి.. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి
మహేశ్వరం, (లోకల్ గైడ్ ): మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేట రైతుబజారులో రెండున్నర దశాబ్దాల నుంచి చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న తమకు అండగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కోరారు. రైతు బజారు ముందు సబ్ రోడ్డులో పెట్టుకుని కూరగాయలు, పండ్లు, చేపలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలని ట్రాఫిక్ పోలీసులు హుకూం జారీ చేశారు. 23ఏళ్ల నుండి అంగడితో అనుబంధం ఉందని, బండ్లు తీయించి తమ పొట్ట కొట్టవద్దని కేఎల్ఆర్ ను కలిశారు. వెంటనే స్పందించిన కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చారు. ట్రాఫిక్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందు కు కృషి చేస్తానని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరగాయల అసోసియేషన్ సభ్యులు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు,