మోక్ష ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ 'మారెమ్మ'- పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్......

మోక్ష ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ 'మారెమ్మ'- పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్......

లోక‌ల్ గైడ్: మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌ను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం ఇంపాక్ట్ ఫుల్ టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రెండింటినీ రిలీజ్ చేశారు. ఇది పవర్ ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా ఉంటుందని హామీ ఇస్తోంది.ఫస్ట్ లుక్ మాధవ్‌ను రూరల్ అవతార్‌లో పరిచయం చేస్తుంది. చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి, మెడలో క్యాజువల్‌గా చుట్టుకున్న టవల్‌తో, మాధవ్ రగ్గడ్ రూరల్ హీరోగా కనిపించారు. అతని చెదిరిన జుట్టు, గడ్డం ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంచబడిన ఒక గేదె, బలం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. మాధవ్ పొడవాటి కర్రను పట్టుకుని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధం గా వున్నట్లు కనిపించారు. పోస్టర్, టైటిల్ అదిరిపోయాయి.మాధవ్‌ను ఫెరోషియస్ రగ్గడ్ పాత్రలో ప్రజెంట్ చేయడానికి మంచాల నాగరాజ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు. మాధవ్ తన తొలి పాత్ర కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు.వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి,  వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయిక గా నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.

Tags:

About The Author

Latest News

కంద (ఎలిఫెంట్ యామ్) తినడం వల్ల లాభాలే లాభాలు కంద (ఎలిఫెంట్ యామ్) తినడం వల్ల లాభాలే లాభాలు
లోక‌ల్ గైడ్ ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న దుంపల్లో కందకి (పులగంద) ప్రత్యేక స్థానం ఉంది. ఎలిఫెంట్ ఫుట్ లేదా ఎలిఫెంట్ యామ్గా ఇంగ్లిష్‌లో పిలుస్తారు. దీని...
రెడ్ వైన్ – మితంగా తాగితే ఆరోగ్యానికి......
రోడ్డు సేఫ్టీ బిల్లును నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు ఆటోల బందును జయప్రదం చేయండి. ఐ ఎఫ్ టి యు
ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో "పోలీస్ వారి హెచ్చరిక" ట్రైలర్ లాంచ్ 
ప్రవహించే మున్నేరు నీటిని...పరివాహక, సమీప ప్రాంతాలకు ఇవ్వకపోవడం అన్యాయం 
మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....
13 నా ఊర పండుగ వేడుకలు...