జూలై 31న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' విడుదల

జూలై 31న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' విడుదల

అదిరిపోయే యాక్షన్ ప్రోమోతో కొత్త విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం

లోక‌ల్ గైడ్:

తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘కింగ్‌డమ్’ విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.‘కింగ్‌డమ్’ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, హీరోయిజం, డ్రామాల సమ్మేళనంగా శక్తివంతమైన చిత్రంగా ‘కింగ్‌డమ్’ రూపుదిద్దుకుంటోంది. ప్రోమోలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, విజువల్స్ కట్టిపడేశాయి. మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సినిమాటిక్ దృశ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నట్లు ఈ ప్రోమో హామీ ఇస్తోంది. ఈ అద్భుతమైన చిత్రాన్ని వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కొత్త విడుదల తేదీ ప్రకటన ఎంతో ఉపశమనాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అభిమానుల అంచనాలకు మించే చిత్రాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో 'కింగ్‌డమ్' కోసం చిత్ర బృందం అదనపు సమయాన్ని కేటాయిస్తోంది.కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు స్పందిస్తూ.. "కింగ్‌డమ్ కేవలం సినిమా కాదు.. ఇది మేము ఎంతో మక్కువతో నిర్మించిన ఒక గొప్ప ప్రపంచం. ప్రతి ఫ్రేమ్ మరపురానిదిగా ఉండాలని మేము కోరుకున్నాము. జూలై 31న ఈ చిత్రం బాక్సాఫీస్ తుఫానుకు నాంది పలుకుతుంది." అన్నారు. కింగ్‌డమ్ రిలీజ్ డేట్ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్భుతమైన విజువల్స్, సంగీతంతో రూపొందిన ఈ ప్రోమో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. 

Tags:

About The Author

Latest News

కంద (ఎలిఫెంట్ యామ్) తినడం వల్ల లాభాలే లాభాలు కంద (ఎలిఫెంట్ యామ్) తినడం వల్ల లాభాలే లాభాలు
లోక‌ల్ గైడ్ ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న దుంపల్లో కందకి (పులగంద) ప్రత్యేక స్థానం ఉంది. ఎలిఫెంట్ ఫుట్ లేదా ఎలిఫెంట్ యామ్గా ఇంగ్లిష్‌లో పిలుస్తారు. దీని...
రెడ్ వైన్ – మితంగా తాగితే ఆరోగ్యానికి......
రోడ్డు సేఫ్టీ బిల్లును నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు ఆటోల బందును జయప్రదం చేయండి. ఐ ఎఫ్ టి యు
ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో "పోలీస్ వారి హెచ్చరిక" ట్రైలర్ లాంచ్ 
ప్రవహించే మున్నేరు నీటిని...పరివాహక, సమీప ప్రాంతాలకు ఇవ్వకపోవడం అన్యాయం 
మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....
13 నా ఊర పండుగ వేడుకలు...