ప్రజావాణి లో దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశం
By Ram Reddy
On
భూపాలపల్లి (లోకల్ గైడ్ ప్రతినిధి)
ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 70 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఇచ్చిన ప్రతి దరఖాస్తును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖాధికారులు జాగ్రత్తగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కారంలో జాప్యం చేయొద్దని ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియచేస్తూ దరఖాస్తులు ఇస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు చేసిన వినతులను కేవలం నమోదు చేయడం కాకుండా వాటిని శాశ్వత పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. దరఖాస్తులు పరిష్కారం కాకుండా ఎక్కువకాలం పెండింగ్‌లో ఉంచితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి దరఖాస్తుకు సమాధానం ఇవ్వడం అవసరమైన సమాచారం ప్రజలకు అందించడం సమస్య పరిష్కారం దిశగా స్పష్టమైన రిపోర్టులు సమర్పించడం ప్రతి అధికారి యొక్క బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి
అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
04 Sep 2025 20:12:15
కామారెడ్డి,లోకల్ గైడ్ :
ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...