సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
విగ్రహాన్ని మాజీ జడ్ పీ టీ సీ సభ్యురాలు బాసు శ్యామల ఆవిష్కరించారు.
By Ram Reddy
On
గట్టు, లోకల్ గైడ్ :
గట్టు మండలంలోని మాచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ నూతన విగ్రహాన్ని మాజీ జడ్ పీ టీ సీ సభ్యురాలు బాసు శ్యామల ఆవిష్కరించారు. బలిగేరా గ్రామ మాజీ సర్పంచ్ విగ్రహాన్ని తయారు చేయించి పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. బాసు శ్యామల మాట్లాడుతు, సర్వే పల్లి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, నేటి ఉపాధ్యాయులు ఆయన అడుగు జాడలల్లో నడవాలన్నారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లి సమాజానికి అందించిన సేవలను, భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన అయన జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Sep 2025 20:12:15
కామారెడ్డి,లోకల్ గైడ్ :
ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...