కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
కలెక్టర్ లక్ష్మి నారాయణ మంజూరు చేయడం జరిగింది.
By Ram Reddy
On
గద్వాల, లోకల్ గైడ్ :
కులాంతర వివాహం చేసుకున్న జంటకు బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని తమ ఛాంబర్ నందు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతిని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఐజా మండలం ఈడిగొనిపల్లి గ్రామానికి చెందిన ఎస్.మనీషా (వైఫ్ ఆఫ్ ఈ.వీరేంద్ర ) ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్నందుకు, ప్రభుత్వ కల్పించిన పథకం ద్వారా రూ. 2.50 లక్షల ప్రోత్సాహక బహుమతిని మంజూరైనట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జంటకు బాండ్‌ను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Sep 2025 20:12:15
కామారెడ్డి,లోకల్ గైడ్ :
ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...