నాగర్ కర్నూల్ మండల బిజెపి నూతన కమిటీ ఎన్నిక
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ భారతీయ జనతా పార్టీ మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా దెంది నోమేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా బాల మల్లయ్య సత్యనారాయణ, మొత్తం 45 మందితో పూర్తి కమిటీ వేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి సీనియర్ నాగేంద్ర గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి మండల ఇన్చార్జి రమణారెడ్డిగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు మనమందరము కలిసికట్టుగా పనిచేసినప్పుడే పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లడానికి వీలుగా ఉంటుందని ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను బూత్ స్థాయి వరకు తీసుకెళ్లినప్పుడే రాష్ట్రంలోమన ప్రభుత్వం అధికారం చేపట్టడం సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ కి కార్యకర్తలే బలమని తెలియజేశారు ఇప్పుడు ఎన్నుకోబడ్డ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాక ప్రతి కార్యకర్త తన వంతు కృషిచేసి పార్టీ కార్యక్రమాలను నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారి భుజస్కందాలపై ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబరు శ్రీశైలం జిల్లా ఉపాధ్యక్షులు పోల్దాసు రాము, ఆఫీస్ సెక్రటరీ చందు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి వెంకట్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు విజయేందర్ రెడ్డి, నాయకులు బాలస్వామి,మొదలగు వారు పాల్గొన్నారు.