రెడ్ బుక్ పుటల్లో రక్తపు ముద్రలు.. పాలనలోనూ అదే కథ

రెడ్ బుక్ పుటల్లో రక్తపు ముద్రలు.. పాలనలోనూ అదే కథ

లోకల్ గైడ్ : రాష్ట్రాన్ని రక్తమోడుస్తున్న పాలనపై జగన్ ఆగ్రహం

రెడ్ బుక్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను రక్తమోడుస్తున్నాయంటూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వంలో దారుణాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా క్షీణించిందని మండిపడ్డారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టిడిపి గూండాలు పట్టపగలే దాడి చేసి చంపే ప్రయత్నం చేయడం దారుణమని జగన్ అన్నారు. ఈ ఘటనపై శుక్రవారం ‘ఎక్స్’లో స్పందిస్తూ,

    “రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్ బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌లతో రాష్ట్రం రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, దాడులు కొనసాగుతున్నాయి. దళిత సర్పంచ్‌పై చేసిన దాడి రాష్ట్రంలో మాఫియా పాలనను చూపుతోంది. చంద్రబాబు ప్రోత్సాహంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ప్రజలకు రక్షణ లేకుండా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన పెట్టకూడదా?”అంటూ ప్రశ్నించారు.

నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి గురించి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా ఆరా తీశారు. శుక్రవారం ఆయన కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో అక్రమాలకు అడ్డుగా ఉన్నాడని, అందుకే ఆయనపై దాడి చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

“నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలి,”అని ఆకాంక్షించారు. సర్పంచ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలంటూ అంబటి మురళీకి జగన్ ఆదేశించారు.

Tags:

About The Author

Latest News