వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...

వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...


నిజామాబాద్ జిల్లా (లోకల్ గైడ్); వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాద్ రాజా వెంకట్ రెడ్డి 
పోలీస్ స్టేషన్ ల  చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు.  మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. పోలీస్ స్టేషన్ లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకోని సంబంధిత యజమానులకు త్వరగా  అప్పగించాలని సంబంధిత  సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ కు సూచించారు...
పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను పట్టణాలలో ఉన్న వార్డులను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు..ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు..అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు..త్వరలో జరుగు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు..ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు  పొందాలని సూచించారు..
ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి  సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు..
ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్  వాటిపై నిఘా పెంచాలని తెలిపారు..
ఇసుక,జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి  ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు..
పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు  మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సిడి ఫైల్స్, తనిఖీ చేశారు ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని అధికారులకు సిబ్బందికి సూచించారు..  రికార్డ్స్ సిసిటిఎన్ఎస్ డాటా  అప్డేట్ ఉన్నందున అధికారులను సిబ్బందిని అభినందించారు.
పోలీస్ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకోని  ఏవైనా సమస్యలు ఉంటేనే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
పోలీస్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన గ్రామాలకు, వార్డులకు తరచుగా సందర్శిస్తూ సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు..
విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని ఉదయం సాయంత్రం విసేబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్ రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు.
పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను  తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు.
డ్రగ్స్ దాని యొక్క ప్రభావం, సైబర్ నేరాలు  తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవసరమైన ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ వద్ద  ఆర్ అండ్ బి అధికారుల సమన్వయంతో  స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు..
మహిళలు పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల సహనుభూతితో  వ్యవహరించి  సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.భార్య భర్తలకు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా పాటించాలని తెలిపారు.కలిసి కాపురాలు చేసే విధంగా కౌన్సిలింగ్ ఉండాలన్నారు వారి కాపురాలు నిలబెట్టే విధంగా వారి సాధక బాధకాలు తెలుసుకొని కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు..

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం