పదోన్నతి ఉత్సాహంతో పాటు బాధ్యత పెంచు తుంది:  

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

పదోన్నతి ఉత్సాహంతో పాటు బాధ్యత పెంచు తుంది:  

నారాయణపేట ఏప్రిల్ 4:
ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలు అందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవం, మర్యాదలు మరింత పెరుగు తాయని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.నర్వ పోలీస్ స్టేషన్‌లో ఏ  ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్న మన్యం  ఎస్సై గా పదోన్నతి పొందా రు. శనివారం ఆయన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ను ఎస్పీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ  తన చేతుల మీదుగా పదోన్నతి పొందిన మన్యం కు రెండు స్టార్లు అలంకరించి అభినంద నలు తెలిపారు.ఈ సందర్భం గా పదోన్నతి పొందిన మన్యం కి తాత్కాలికంగా రూరల్ పోలీస్ స్టేషన్‌ కు బదిలీ చేయడం జరిగింది.
అనంతరం ఎస్పీ  మాట్లా డుతూ పదోన్నతి అనేది కేవలం ఉత్సాహానికే కాదు, మరింత బాధ్యతను కూడా తీసుకువస్తుందని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధి తులకు భరోసా, నమ్మకం కలిగించే విధంగా పని చేయా లని, ముఖ్యంగా నిరు పేద ప్రజలకు పోలీసులు అండగా నిలవాలని సూచించారు.
ఫోటో రైట్ అప్:7.స్టార్ తొడుగుతున్న ఎస్పీ.
_______________________

Tags:

About The Author

Latest News