శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ కేక్ కట్ చేసి గణేష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గణేష్ కుమార్ ఆయురారోగ్యాలతో ఆనంద సంతోషాలతో జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం మొత్తం స్నేహపూర్వక, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. నాయకులు, కార్యకర్తలు కలిసి వేడుకను ఆనందంగా జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక రాజకీయ నాయకుల జన్మదిన వేడుకలు కార్యకర్తల మధ్య ఐక్యతను పెంపొందించ డంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు నాయకత్వంపై విశ్వాసాన్ని పెంచడంతో పాటు పార్టీ కార్యకలాపాలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. ఈ కార్యక్రమంలో ఏం.శ్రీకాంత్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.