రసాయన శాస్త్రంలో నాగులంచ భుజంగరావుకు పీహెచ్.డీ.

రసాయన శాస్త్రంలో నాగులంచ భుజంగరావుకు పీహెచ్.డీ.

 

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

హైదరాబాద్ గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి భుజంగరావు నాగులంచ పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించారు. “ఆర్‌పీ-హెచ్‌పీఎల్‌సీ, ఎల్‌సీ-ఎంఎస్, క్యూ‌బీడీ విధానాల ద్వారా ఔషధ మోతాదు రూపాలలో జన్యు విష మలినాలు, ఐసోమర్లు, విఘటన ఉత్పత్తుల అంచనా, స్థిరత్వ సూచిక పద్ధతుల అభివృద్ధి, ధ్రువీకరణ అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించారు. ఈ పరిశోధనకు గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వి. కోటేశ్వరరావు మార్గదర్శనం వహించారు. ఔషధాలలోని మలినాలను కచ్చితంగా గుర్తించేందుకు హెచ్‌పీఎల్‌సీ, ఎల్‌సీ-ఎంఎస్, ఎల్‌సీ-ఎంఎస్/ఎంఎస్ సాంకేతికతలతో పాటు విశ్లేషణాత్మక రూపకల్పన ద్వారా నాణ్యత (ఏక్యూబీడీ), ప్రయోగాల రూపకల్పన (డీఓఈ) విధానాలను వినియోగించినట్టు తెలిపారు. బలోక్సావిర్ మార్బాక్సిల్, గ్లిపిజైడ్, క్లోర్ జోక్సాజోన్, అబ్రోసిటినిబ్, సెర్ట్రాలిన్ వంటి ఔషధాలలో సూక్ష్మ స్థాయి జన్యు విష మలినాలను గుర్తించే విధానాలపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. దీని ద్వారా ఔషధ నాణ్యత, భద్రత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. భుజంగరావు సాధనపై గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ప్రిన్సిపాల్ డా.ఎం.రెజా, విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

Tags:

About The Author

Latest News