పాతర్లపాడు:లోకల్ గైడ్ :
పాతర్లపాడు గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించినారు, ఈ గ్రామ సభకు సర్పంచ్ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళ సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వివరాలు తెలియజేశారు, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు, ప్రజల అవసరాల మేరకు రోడ్లు మౌలిక వసతులు అభివృద్ధి చేపడుతామని ప్రజా ప్రతినిధులు తెలిపారు.గ్రామాల్లో సిసి రోడ్లు భారీ స్థాయిలో నిర్మించాలని, సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని వారు వివరించారు, ప్రతి ఇంటికి ఐదు లక్షల బీమా కల్పించే దిశగా ప్రభుత్వం ఇంద్ర బీమా పథకం ప్రవేశపెడుతుందని తెలిపారు నూతన రేషన్ కార్డులు పంపిణీ ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు లీకేజీ రుణాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పేరిట ప్రభుత్వం 99 రోజులు ప్రత్యేక కార్యచరణ తీసుకుంటుందని అన్నారు. వైద్యశాఖ రోడ్డు భద్రత, మహిళా సంక్షేమం యువజన క్రీడా శాఖ త్రాగినీటి సరఫరా వ్యవసాయం వంటి వివిధ శాఖల ద్వారా జూన్ 12 వరకు వివిధ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం, ప్రణాళిక సిద్ధం చేయాలని, మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నుదులు దృష్టిలో ఉంచుకొని రాబోయే ఐదు సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు ప్రాథమిక ప్రకారం ఎంపిక చేయాలని ఆమె సూచించారు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు స్పెషల్ ఆఫీసర్ ఏఈఓ జిపిఓ అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు గ్రామ పెద్దలు చింతకాని ఎస్సై పాల్గొన్నారు