అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం-రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  

నందిగామ మండలం అప్పరెడ్డి గూడ లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం-రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  

IMG-20250906-WA0501రంగారెడ్డి    లోకల్ గైడ్ :  

 రానున్ను రోజుల్లో మూడు విడతల్లో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని  అప్పుల కుప్పగా చేసినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టు పెట్టైన రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి పదేళ్లు ప్రజలను మోసం చేసిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం  7 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసిందని, రైతు రుణమాఫీ, సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం 0%  వడ్డీ లేని రుణాలను కోట్ల రూపాయల రుణాలను అందజేస్తుందని చెప్పారు. అప్పారెడ్డి గూడలో మొత్తం 39 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 9 ఇండ్లు వివిధ నిర్మాణ దశలో ఉండగా, న్నాయి, పూర్తైన నాలుగు ఇండ్లను మంత్రులు ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లు సభలో మాట్లాడారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, హౌసింగ్ పీడీ నాయక్, ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..
_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): ప్రైవేట్ టీచర్ల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం..ఆదివారం,వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో నవభారత నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వరంగల్ పశ్చిమ...
నదిదూడలో రైతులకు యూరియా పంపిణీ – వేసేపల్లి సహకార సంఘం వద్ద ఉదయం నుంచే భారీ క్యూలు
కొందగట్టు అంజనేయ స్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూసివేత
పెన్షన్లను పెంచడంలో సీఎం వైఖరిని నిరసిస్తూ  రేపు 8వ తేదీన కలెక్టరేట్ ముందు మహా ధర్నా
పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి దిశగా తెలంగాణ: మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు
సూర్యపేట: చరిత్ర, రాజకీయాలు, అభివృద్ధి ఆశల మధ్య ఓ నియోజకవర్గం ప్రయాణం
పరిటాల రవీంద్ర గారికి ఘాట్ వద్ద ఘన నివాళి – రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి, ఎమ్మెల్యేల సాహచర్యంలో కార్యక్రమం