పెన్షన్లను పెంచడంలో సీఎం వైఖరిని నిరసిస్తూ రేపు 8వ తేదీన కలెక్టరేట్ ముందు మహా ధర్నా
జిల్లా ఇంచార్జి ఆడెపు నాగార్జున మాదిగ
.
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు పెన్షన్ రూ 6000/-రూ' మరియు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికుల తో పాటు మొత్తం చేయూత పెన్షన్లను రూ 4000/- పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకుగాను నిరసనగా సెప్టెంబర్ 8వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు పెన్షన్ దారులతో పెద్ద ఎత్తున మహాధర్నాను చేపడుతామని ఎమ్మార్పీఎస్ ,యం ఎస్ పి అనుబంధ సంఘాల జిల్లా ఇంచార్జి ఆడెపు నాగార్జున మాదిగ మద్దిలేటి మాదిగలు తెలిపారు.
నాగర్ కర్నూల్ పట్టణం మరియు నాగనూరు నెల్లికొండా దేశి ఇటిక్యాల ఉయ్యాలవాడ ఎండబెట్ల గగ్గలపల్లి శ్రీపురం నల్లవెల్లి మంతటి బందలపల్లి వనపట్ల గ్రామాలలో వికలాంగులు చేయూత పెన్షన్దారుల సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలు ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు గుటా విజయ మాదిగ మండల అధ్యక్షులు భాస్కర్ మాదిగ జిల్లా సీనియర్ నాయకులు నాగయ్య మాదిగల అధ్యక్షతన సమావేశాలు జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆడెపు నాగార్జున మాదిగ మద్దిలేటి మాదిగలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఖరి ఊసరవెల్లిని తలపిస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు మాకు ఓటు వేయండి వచ్చే నెలలోనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని 22 నెలలు గడిచిన పెన్షన్ రూపాయలు పెంచకుండా కొత్త పెన్షన్ లు ఇవ్వకుండా ఘోరంగా మోసం చేయడం జరిగింది.రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని నిరూపించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల పైగా పెన్షన్ దారులు ఉన్నారని విషయం మర్చిపోవద్దని అన్నారు. వారి శక్తి ఏమిటో స్థానిక సంస్థ ఎన్నికల్లో నిరూపితం అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచితే తెలంగాణలో రేవంత్ రెడ్డి పెంచకపోవడం దుర్మార్గం అని అన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి పెన్షన్ల పెంపుపై ప్రకటన చేయాలని అలాగే ఎన్నో ఏళ్ల నుండి నూతన పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వంపై పోరాడడంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయి అన్నారు. అందుకే మందకృష్ణ మాదిగ ముందుకు వచ్చి పెన్షన్ దారుల కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. ఆ పోరాటంలో భాగంగానే సెప్టెంబర్ 8న చలో కలెక్టరేట్, 12న ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నా, 20 న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం , 21 నుండి 26 వరకు గ్రామ పంచాయతీల ముందు ధర్నా, 27న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం మొదలగు ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ పోరాటంలో వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత కార్మికులు గీత కార్మికులు బీడీ కార్మికులు కండరాల క్షీణత కలిగిన వారు మరియు అన్ని రకాల పెన్షన్ దారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు రాజు మాదిగ, కొల్లాపూర్ మండల ఇన్చార్జి నాయకులు వీరపాగ రాములు మాదిగ, పెంట్లవెల్లి మండల ఇన్చార్జి బంకల కురుమయ్య మాదిగ, సీనియర్ నాయకులు పరమేష్ మాదిగ, మరియు
వృద్ధులు, వితంతువుల, చేయూత పెన్షన్ల దారులు తదితరులు పాల్గొన్నారు