రబీ వరి కొనుగోళ్లకు సిద్ధం – 421 కేంద్రాల ద్వారా 5.5 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం

జిల్లా కలెక్టర్ కె. హైమావతి

రబీ వరి కొనుగోళ్లకు సిద్ధం – 421 కేంద్రాల ద్వారా 5.5 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం

 
 
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ) 
 
ఏప్రిల్ 15: సిద్దిపేట జిల్లా లో ఈ రబీ సీజన్‌ 2025–26 లో వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. జిల్లాలో మొత్తం 421 కొనుగోలు కేంద్రాలను (IKP–211, PACS–202, MEPMA–06, FPO–02) ఏర్పాటు చేసి, సుమారు 5,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, డ్రైయర్లు వంటి పరికరాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. FAQ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.గత యాసంగి 2024–25లో 93,142 మంది రైతుల నుంచి 3,84,147 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 884.56 కోట్లు చెల్లించగా, వానకాలం 2025–26లో 1,02,058 మంది రైతుల నుంచి 3,77,466 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రూ. 901.66 కోట్లు చెల్లించడంతో పాటు సన్న ధాన్యానికి రూ. 10.14 కోట్లు బోనస్ అందించామని తెలిపారు.ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 23 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Tags:

About The Author

Latest News