సొల్లు మాట్లాడే వారికి ఇది గుణపాఠం 

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. - ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం.

సొల్లు మాట్లాడే వారికి ఇది గుణపాఠం 

మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి.

గద్వాల, లోకల్ గైడ్ :
 సొల్లు మాటలు మాట్లాడే టిఆర్ఎస్, బిజెపి నాయకులకు ఇది ఒక గుణపాఠం అని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచారం పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. శనివారం గద్వాల పట్టణ సమీపంలోని దౌదర్పల్లి దగ్గర నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇళ్ళను మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ చేతుల మీదుగా గృహప్రవేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పేద ప్రజల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని గత పది సంవత్సరాలలో నిరుపేదలకు ఇల్లు కట్టించాలని తపన ఆనాటి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3500 మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి ఇంటికి ఐదు లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల 50 వేల మందికి ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని అన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు 9 కోట్లు మంజూరు చేశామని వాటి ద్వారా ఇల్లు నిర్మించు కుంటారని తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలని తలంపుతో వారికి అనేక విధాలుగా ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల విద్యుత్తు 500 గ్యాస్ సబ్సిడీ సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ కొరకు 21 వేల కోట్లు ఖర్చు చేశామని రైతులకు వరి పండిస్తే 500 బోనస్ అందజేసినట్లు తెలిపారు. అలాగే రైతు భరోసా ప్రతి పంటకు ఇస్తున్నామని తెలిపారు. ధరణితో ఇబ్బందులు పడకుండా భూభారతి ప్రవేశపెట్టి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జిపిఓ కేటాయించినట్లు ప్రతి మండలానికి 20 మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించినట్లు మంత్రి తెలిపారు. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిచే ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందాలనే తలంపుతో మంత్రి శ్రీనివాసులు రెడ్డి కృషి చేశారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పేదవారి సంక్షేమ పథకాలు ఆగరాదని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆనాడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా అనేకమంది రైతులకు మహిళా సంఘాలకు రుణాలు అందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నూతన గృహప్రవేశాలు చేసుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో పేదలకు ఎలాంటి ఇల్లు నిర్మించలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశారని తెలిపారు. అలాగే విద్య ప్రతి ఒక్కరికి అందాలని 22,500 కోట్లతో ప్రతి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఏళ్ళు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి మహిళను కోటీశ్వరుడు గా చేసేందుకు వారికి పెట్రోల్ బంకులు ఇంకా ఇతర సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి ఎం సంతోషి మాట్లాడుతూ 75 కోట్లతో మొదటి దశ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 560 పూర్తి చేశామని రెండవ విడత 715 ఏళ్లు నిర్మించినట్లు తెలిపారు.  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో స్కూల్ కమిటీ హాల్ నిర్మించినట్లు సమీపంలోనే మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఉన్నదని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారు సొంత ఇంటిని వారే నివసించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన సొంత ఇంటి కల నెరవేరిందని మంత్రులకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా అర్హులు ఎవరైనా ఉన్నా వారికి తప్పక ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించి మొదటి విడతగా లక్ష రూపాయలు జమ చేస్తే వాటిని బ్యాంకర్లు అప్పు క్రింద జమ చేసుకుంటున్నారని, దానిని పరిశీలించాలనిIMG-20250906-WA0219 మంత్రులకు తెలిపారు. త్వరలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అన్ని వసతులు కల్పిస్తామని, మిగతా నిర్మించిన ఇళ్లను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.  లబ్ధిదారులందరూ కేటాయించిన గృహాలలో తప్పకుండా ఉండాలని, అద్దెకు ఇవ్వడం గానీ, అమ్ముకోవడం ఇలాంటి చర్యలకు పాల్పడితే మంజూరైన ఇంటిని రద్దు చేస్తామన్నారు. అంతకుముందు మంత్రులకు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన వారితో మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు.  ఈ సందర్భంగా తొమ్మిది కోట్ల రూపాయల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఇండ్ల రుణాల క్రింద అందజేశారు, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రులు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల హనుమంతు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..
_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): ప్రైవేట్ టీచర్ల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం..ఆదివారం,వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో నవభారత నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వరంగల్ పశ్చిమ...
నదిదూడలో రైతులకు యూరియా పంపిణీ – వేసేపల్లి సహకార సంఘం వద్ద ఉదయం నుంచే భారీ క్యూలు
కొందగట్టు అంజనేయ స్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూసివేత
పెన్షన్లను పెంచడంలో సీఎం వైఖరిని నిరసిస్తూ  రేపు 8వ తేదీన కలెక్టరేట్ ముందు మహా ధర్నా
పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి దిశగా తెలంగాణ: మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు
సూర్యపేట: చరిత్ర, రాజకీయాలు, అభివృద్ధి ఆశల మధ్య ఓ నియోజకవర్గం ప్రయాణం
పరిటాల రవీంద్ర గారికి ఘాట్ వద్ద ఘన నివాళి – రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి, ఎమ్మెల్యేల సాహచర్యంలో కార్యక్రమం