జలమయమైన పాలజ్ గణేష్ మందిరం

వరద నీటితో నిండిపోయిన ఆలయ పరిసరాలు

జలమయమైన పాలజ్ గణేష్ మందిరం

దర్శనం కోసం పడరాని పాట్లు పడుతున్న భక్తజనం

IMG-20250829-WA0088

భారీ వర్షాల నేపథ్యంలో   మహారాష్ట్రంలోని పాలజ్ గణేష్ మందిరం జలమయమైంది. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ వరద నీటితో నిండుకపోయాయి. మోకాలిలోతు కంటే పై బాగంలో వరద నీరు నిలిచిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. దర్శనం కోసం వేళ్లేందుకు గాను పడరాని పాట్లు పడుతున్నారు. శుక్రవారం వేకువ జామున పాలజ్ తో పాటు అక్కడి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆలయానికి ఎగువ భాగంలోనున్న కీని గుట్ట ప్రాంతం నుంచి వర్షపు నీరు ఉదృతితో పాలజ్ వైపు ప్రవహించింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతంగానున్న పాలజ్ గణేష్ మందిరం వైపు అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరింది. వరద నీరు ఆలయ పరిసరాలన్నీంటిని ముంచెత్తింది. ఆలయ ప్రవేశ మార్గంతో పాటు ఇతర ప్రాంతాలన్నీ మోకాలిలోతు కంటే పై భాగంలో వదర నీరు నిలిచింది. దీంతో ఆలయంలోకి వెళ్లి పాలజ్ గణేషుని దర్శనం కోసం భక్తజనం పడుతున్న తిప్పలు వర్ణణాతీతంగా ఉన్నాయి. పిల్ల,పాపలు, వృద్ధులతో వచ్చిన భక్తులు ఆగచాట్ల పాలవుతున్నారు. ఇక అక్కడి వ్యాపారస్తులు తమ విక్రయ సామాగ్రి తడిసిపోకుండా,వరద నీటి ప్రవహంలో కొట్టుకపోకుండా కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి