బావోజీ ని దర్శించుకున్న

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 

బావోజీ ని దర్శించుకున్న

నారాయణపేట ఏప్రిల్ 4:
నారాయణపేట జిల్లా  కొత్త పల్లి మండలంలోని తిమ్మా రెడ్డి పల్లి లో  గత మూడు రోజులుగా కొనసాగుతున్న  శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు ( బావోజి) జాతర బ్రహ్మోత్స వాలకు శనివారం జిల్లా కలె క్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని బావోజీ నీ దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ అధికారి,ఆర్డీవో రామచందర్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ కు గౌరవ పూర్వక స్వాగతం పలికారు. అనంతరం  గురు లోక్ మాసంద్ ప్రభును,  పక్కనే ఉన్న కాళీకా దేవి మాత ను కలెక్టర్ దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం  కమిటీ సభ్యులు కలెక్టర్ ను ఆర్డీవో ను సన్మానించారు. కాగా జాతర ఏర్పాట్లపై కలె క్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం వరకు జాతర ఉత్సవాలు ముగు స్తాయనీ, అధికారులంతా జాతర ముగిసే వరకు దగ్గ రుండి పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే భక్తు లందరూ తిరిగి వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూడాలని, ట్రాఫిక్ సమ స్య లేకుండా వాహన రాక పోకలను సజావుగా కొన సాగించాలని, జాతర ముగిసే వరకు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో డిఆర్డిఓ మొగులప్ప, డిపివో సుధాకర్ రెడ్డి, డీపీ ఆర్ వో రషీద్, తహశీల్దార్ జయరాములు, మద్దూరు, కొత్తపల్లి ఎంపీడీవోలు, సీఐ సైదులు పాల్గొన్నారు. 
ఫోటో రైట్ అప్:4.బావోజీ నీ దర్శించుకున్న కలెక్టర్
----------------------------------------

Tags:

About The Author

Latest News