కేదార్‌నాథ్ మంచు కొండల్లో సిద్దిపేట వారి అన్నదాన సేవ – హరీష్ రావు ప్రశంస

కేదార్‌నాథ్ మంచు కొండల్లో సిద్దిపేట వారి అన్నదాన సేవ – హరీష్ రావు ప్రశంస


 
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ) 

ఏప్రిల్ 04:మంచు కొండల్లో సైతం సిద్దిపేట అన్నదాన సేవలు అమోఘంగా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు.శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన యాత్ర కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే కేదార్‌నాథ్‌కు పంపించనున్న ఆహార పదార్థాల వాహనాన్ని కూడా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మానవ సేవే మాధవ సేవ” అనే భావంతో కేదార్‌నాథ్‌కు వచ్చే భక్తులకు అన్నదానం చేయడం ఎంతో గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు.ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభమయ్యే కేదార్‌నాథ్ యాత్ర సందర్భంగా యాత్రికులకు అన్నప్రసాదం అందించేందుకు సిద్దిపేట అన్నదాన సేవా సమితి ఏర్పాట్లు చేసింది. కేదారేశ్వరుని సన్నిధిలో ఇది ఆరో సారి నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమం కావడం విశేషం.ఈ సేవా కార్యక్రమం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఇందులో పాల్గొంటున్న అందరినీ ఆయన అభినందించారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!